Telugu Global
Telangana

అక్రెడిటేషన్‌ కార్డుల కాలపరిమితి పొడిగింపు

మరోసారి మూడు నెలల గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు

అక్రెడిటేషన్‌ కార్డుల కాలపరిమితి పొడిగింపు
X

ఇన్ఫర్మేషన్‌ అండ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ డిపార్ట్‌మెంట్‌ జర్నలిస్టులకు ఇచ్చిన అక్రెడిటేషన్‌ కార్డుల కాల పరమితిని మరో మూడు నెలలు పొడిగించింది. ఈమేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ప్రభుత్వం జారీ చేసిన అక్రెడిటేషన్‌ కార్డుల కాల పరిమితి ఈ ఏడాది జూన్‌ 30వ తేదీతో ముగిసింది. జూలై ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్‌ 30 వరకు కాల పరిమితి పొడిగిస్తూ గతంలో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు మరో మూడు నెలలు గడువు పొడిగించారు. అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచి డిసెంబర్‌ నెలాఖరు వరకు కార్డుల గడువు పొడిగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వం అక్రెడిటేషన్‌ నిబంధనలు మార్చాలనే యోచనలో ఉంది. డిజిటల్‌ మీడియాకు అక్రెడిటేషన్‌ కార్డులు ఇచ్చేందుకు సంప్రదింపుల ప్రక్రియ మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న అక్రెడిటేషన్‌ కార్డుల కాల పరిమితిని పొడిగించింది. అక్రెడిటేషన్‌ కార్డుల జారీకి విధివిధానాలు ఖరారు చేసిన తర్వాత స్టేట్‌ లెవల్‌, డిస్ట్రిక్ట్‌ లెవల్‌ అక్రెడిటేషన్‌ కమిటీలను ఏర్పాటు చేసి కొత్త కార్డుల జారీ ప్రక్రియ మొదలు పెట్టనుంది.





First Published:  26 Sept 2024 4:01 PM IST
Next Story