Telugu Global
Telangana

కాంగ్రెస్ నుండి మర్రి శశిధర్ రెడ్డి బహిష్కరణ‌

బీజేపీలో చేరబోతున్న మర్రిశశిధర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకుగాను శశిధర్ రెడ్డిని ఆరేళ్ళపాటు బహిష్కరిస్తూ క్రమశిక్ష‌ణా సంఘం చైర్మెన్ చిన్నారెడ్డి ఓ ప్రకటన చేశారు.

కాంగ్రెస్ నుండి మర్రి శశిధర్ రెడ్డి బహిష్కరణ‌
X

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నా రెడ్డి కుమారుడు మర్రి శశిధర్ రెడ్డిని ఆ పార్టీ బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు ఆయనను పీసీసీ క్రమ శిక్షణా సంఘం ఆరేళ్ళపాటు పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు క్రమశిక్షణా కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.

శశిధర్ రెడ్డి ఢిల్లీ లో బీజేపీ అగ్రనేత అమిత్ షాను కలిశారు.ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఎన్నటికీ తగ్గని క్యాన్సర్ సోకిందని వ్యాఖ్యానించారు. పైగా తాను బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడైనప్పటినుంచి తెలంగాణలో కాంగ్రెస్ సర్వనాశ‌నం దిశగా పయనిస్తోందని శశిధర్ రెడ్డి అనేక సార్లు ఆరోపించారు. అంతే కదు. ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ రేవంత్ కు అమ్ముడు పోయారని కూడా వ్యాఖ్యానించారు. .

కాగా ఆయన మూడు రోజుల క్రితం బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో కలిసి ఢిల్లీకి వెళ్ళారు. అప్పుడే ఆయన‌ బిజెపిలో చేరబోతున్నారనే వార్తలు రాగా ఆయన మాత్రం ఆ వార్తలను ఖండించారు. తన మనవడి స్కూల్ ఫంక్షన్ కోసమే ఢిల్లీకి వెళ్ళానని చెప్పారు.


First Published:  19 Nov 2022 11:46 AM GMT
Next Story