హైదరాబాద్ లో పేలుడు, ఇద్దరికి గాయాలు...ఒకరి పరిస్థితి విషమం
Explosion in Hyderabad: లోయర్ టాంక్ బండ్ వద్ద డంపింగ్ యార్డ్ లో జరిగిన పేలుడులో తండ్రీ, కొడుకులు గాయపడ్డారు. కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
BY Telugu Global15 Dec 2022 8:30 PM IST

X
Telugu Global Updated On: 15 Dec 2022 9:46 PM IST
గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దిగువ ట్యాంక్ బండ్ వద్ద గల డంపింగ్ యార్డులో గురువారం సాయంత్రం జరిగిన పేలుడులో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. తండ్రీకొడుకులైన వారిద్దరినీ చికిత్స నిమిత్తం ప్రభుత్వ గాంధీ ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, గాంధీనగర్ ఇన్ స్పెక్టర్ మోహన్ రావు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుడు ఘటనకు సంబంధించిన ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు.
పేలుడులో గాయపడిన వ్యక్తులను ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా కు చెందిన చంద్రన్న, అతని కుమారుడు సురేష్‌గా గుర్తించారు. సురేష్ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు.
Next Story