ఉత్కంఠ రేపుతున్న మునుగోడు ఎన్నిక
మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. నాడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న పాల్వాయి స్రవంతి ఇప్పుడు బీఆర్ఎస్‌లో చేరారు.
సరిగ్గా ఏడాది కిందట ఇదే నెల 6వ తేదీన మునుగోడు ఉపఎన్నిక ఫలితాలు వచ్చాయి. దేశం దృష్టిని ఆకర్షించిన ఆ రసవత్తర పోరులో గులాబీ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి 10వేల పైచిలుకు మెజారిటీతో ఘన విజయం సాధించారు. మునుగోడు ఉపఎన్నిక నాటికి, ఇప్పటికి నియోజకవర్గం ముఖ చిత్రమే మారిపోయింది. ఎన్నికల వేళ అభ్యర్థుల పార్టీ మార్పుతో రాజకీయ సమీకరణాలు మొత్తం తారుమారయ్యాయి.
మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. నాడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న పాల్వాయి స్రవంతి ఇప్పుడు బీఆర్ఎస్‌లో చేరారు. నాడు, నేడు కాంగ్రెస్ టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించి నిరాశకు గురైన చలమల కృష్ణారెడ్డి.. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. అప్పటి ఉపఎన్నికలో అధికార బీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చిన సీపీఐ.. ఇప్పుడు కాంగ్రెస్‌కు సపోర్ట్ చేస్తోంది.
మునుగోడు ఉపఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి 97వేల 6ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి 86వేల 697 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి 23వేల 906 ఓట్లు వచ్చాయి. వామపక్షాల మద్దతుతో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి 10,309 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే అభ్యర్థుల పార్టీ మార్పు ఫలితాన్ని మార్చబోతోందా..? మునుగోడు ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోంది అనేది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.