కేసీఆర్ కి జై కొట్టిన మాజీ సైనికులు.. ఎందుకంటే..?
మహారాష్ట్ర లోని అన్ని జిల్లాల నుంచి మాజీ సైనికులు, సైనిక సంఘాల నేతలు హైదరాబాద్ కి వచ్చి సీఎం కేసీఆర్ ని కలిశారు. వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్
'అబ్ కి బార్ కిసాన్ సర్కార్' అనేది బీఆర్ఎస్ నినాదం. ఇప్పటి వరకూ మహారాష్ట్ర నుంచి రైతులు, రైతు సంఘాల నేతలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లో చేరారు. కిసాన్ ల తోపాటు ఇప్పుడు జవాన్లు కూడా ముందుకొచ్చారు. జై కేసీఆర్ అంటున్నారు. మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున మాజీ జవాన్లు హైదరాబాద్ కి తరలి వచ్చారు. వారంతా సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ ను బలపరుస్తామని చెప్పారు. జై జవాన్, జై కిసాన్, జే బీఆర్ఎస్ అంటూ నినాదాలు చేశారు.
‘అబ్ కి బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదంతో ముందుకు సాగుతూ, ‘పరివర్తన్ భారత్’ తోనే దేశంలో గుణాత్మక మార్పు సాధ్యమని బీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు దేశ ప్రజలకు ఇస్తున్న పిలుపుతో దేశ సైనికులు కూడా చేయి చేయి కలిపేందుకు ముందుకు వచ్చారు. దేశాన్ని కాపాడేందుకు… pic.twitter.com/tkKfqkdIMV
— BRS Party (@BRSparty) July 2, 2023
మహారాష్ట్ర లోని అన్ని జిల్లాల నుంచి మాజీ సైనికులు, సైనిక సంఘాల నేతలు హైదరాబాద్ కి వచ్చి సీఎం కేసీఆర్ ని కలిశారు. వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్. 'అబ్ కి బార్ కిసాన్ సర్కార్' పిలుపునందుకొని రైతు రాజ్య స్థాపన కోసం జవాన్లు ముందుకు రావడం గొప్ప పరిణామమని అన్నారాయన. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పుకి ఇది సూచన అని చెప్పారు. సాంప్రదాయ పద్ధతుల్లో ఏడు దశాబ్దాలుగా కొనసాగుతున్న పాలనను సమూలంగా మార్చి రైతుల సంక్షేమం, అభివృద్ధి, సబ్బండ వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగుతామని చెప్పారు కేసీఆర్.
తెలంగాణలో అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి మాజీ సైనికులకు వివరించారు సీఎం కేసీఆర్. మహారాష్ట్రలో కూడా వీటిని అమలు చేస్తూ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకు రావాలని, ఆ దిశగా మాజీ సైనికులు కర్తవ్య నిర్వహణ కొనసాగించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. నాసిక్ జిల్లాకు చెందిన ‘ఫౌజీ జనతా పార్టీ’ కార్యదర్శి సునీల్ బాపూరావు సహా.. పలువురు మాజీ కల్నల్స్, మాజీ లెఫ్టి నెంట్ అధికారులు, మాజీ సైనికులు బీఆర్ఎస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే బాల్క సుమన్, మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలచారి తదితరులు పాల్గొన్నారు.