కేఏ పాల్‌కు ఎన్ని ఓట్లు వస్తాయి? సర్వత్రా ఆసక్తి
మునుగోడు ఉప ఎన్నికలో ఎందరో స్వతంత్ర అభ్యర్థులు పోటీచేశారు? కానీ వారెవ్వరి మీద లేని ఆసక్తి కేవలం కేఏపాల్ మీద ఉండటానికి కారణం ఆయన వ్యవహార శైలే.
మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ చేసిన హడావుడి అంతా ఇంత కాదు.. ఓ వైపు మునుగోడు కోసం బీజేపీ, టీఆర్ఎస్ హోరాహోరీగా పోరాడాయి. కాంగ్రెస్ ఇక్కడ బరిలో నిలిచినా పెద్దగా ఫోకస్ కాలేదు. నిత్యం ఇటు టీఆర్ఎస్, అటు బీజేపీ క్యాంపుల నుంచి విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయం వేడెక్కింది.
ప్రస్తుతం మునుగుడులో ప్రశాంత వాతావరణం నెలకొన్నది. మరికొన్ని గంటల్లోనే ఈ ఎన్నికకు సంబంధించిన ఫలితాలు రానున్నాయి. ఇదిలా ఉంటే మునుగోడు ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా ఉంగరం గుర్తుమీద పోటీచేసిన కేఏపాల్ కు ఎన్ని ఓట్లు వస్తాయన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
ఈ ఎన్నికల్లో గంభీరమైన వాతావరణం ఉన్న సందర్భంలో కేఏ పాల్ అందరికీ కామెడీని పంచారు. ప్రచారంలో భాగంగా ఊరూరు తిరుగుతూ.. చేసిన ప్రచారం వినోదాన్ని పంచారు.
ఇక పోలింగ్ రోజు ఆయన పరుగులు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆయనకు ఈ ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వస్తాయన్న విషయంపై ప్రస్తుతం ఆసక్తి నెలకొన్నది. మునుగోడు ఉప ఎన్నికలో ఎందరో స్వతంత్ర అభ్యర్థులు పోటీచేశారు? కానీ వారెవ్వరి మీద లేని ఆసక్తి కేవలం కేఏపాల్ మీద ఉండటానికి కారణం ఆయన వ్యవహార శైలే. మొత్తంగా ఈ మొత్తం ఉప ఎన్నిక ప్రహసనంలో కేఏపాల్ ఓ కమెడియన్ గా మిగిలిపోయారు. నేటి ఫలితాల్లో ఆయనకు ఎన్ని ఓట్లు వస్తాయో.. వేచి చూడాలి.