Telugu Global
Telangana

బీఆర్ఎస్ ఓడినా.. కేటీఆర్ మెచ్యూరిటీకి ఫిదా

రెండుసార్లు అవ‌కాశ‌మిచ్చిన ప్ర‌జ‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన కేటీఆర్ ఈ ఫ‌లితాల‌తో నిరాశ చెంద‌డం లేద‌ని, త‌ప్పులు స‌రిదిద్దుకుని ముందుకెళ్తామ‌ని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను 60 వేల మందికి పైగా లైక్ చేశారు. చాలామంది రీపోస్ట్ చేశారు.

బీఆర్ఎస్ ఓడినా.. కేటీఆర్ మెచ్యూరిటీకి ఫిదా
X

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన‌ప్ప‌టికీ దాన్ని హుందాగా స్వీక‌రించిన ఆ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. పదేళ్లు త‌మ‌కు అధికారం ఇచ్చిన ప్ర‌జ‌ల‌కు కృత‌జ్ఞ‌త‌ల‌ని, గెలిచిన కాంగ్రెస్‌కు కంగ్రాట్స్ అని కేటీఆర్ ప్రెస్‌మీట్లో మాట్లాడిన మాటలకు సెల‌బ్రిటీల నుంచి అంద‌రూ శ‌భాష్ అంటున్నారు. మ‌రోవైపు సామాన్యులు కూడా కేటీఆర్ లాంటి క్యాప‌బుల్ మినిస్ట‌ర్‌ను కోల్పోయామంటూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

హ్యాట్సాఫ్ అన్న ఆర్జీవీ

కేటీఆర్ మెచ్యూర్డ్ అప్రోచ్‌పై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. రెండుసార్లు అవ‌కాశ‌మిచ్చిన ప్ర‌జ‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన కేటీఆర్ ఈ ఫ‌లితాల‌తో నిరాశ చెంద‌డం లేద‌ని, త‌ప్పులు స‌రిదిద్దుకుని ముందుకెళ్తామ‌ని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను 60 వేల మందికి పైగా లైక్ చేశారు. చాలామంది రీపోస్ట్ చేశారు. ప‌లువురు నెటిజ‌న్లు, సెల‌బ్రిటీలు కూడా రిప్ల‌యి ఇచ్చారు. మీరు నిజమైన నాయకుడు సార్.. ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు.. మీ హయాంలో హైదరాబాద్ ఎంతో పురోగతి సాధించింది. బలమైన ప్రతిపక్ష నేతగా ఉండి కూడా మీరు చేయాల్సింది చేస్తారని ఆశిస్తున్నాను.. ధన్యవాదాలు సార్‌.. అని స్టార్ యాంక‌ర్ అన‌సూయ ట్వీట్‌ చేసింది. ‘ఓటమిని ఇంత సానుకూల దృక్పథంతో స్వీకరించిన ఏ రాజకీయ నాయకుడిని నేను చూడలేదు. ఆ విషయంలో మీకు హ్యాట్సాఫ్. ఇలాంటి ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యమే అందరికి కావాల్సింది’ అని ఆర్జీవీ ట్వీట్ చేశారు.

అన్నా మేం ఎప్ప‌టికీ మీ అభిమానులమే

మేము ఇప్పటికీ, ఎప్పటికీ మీ అభిమానులమే అన్నా అని కేటీఆర్‌ ట్వీట్‌కు కామెంట్‌ పెట్టాడు యువహీరో సందీప్ కిష‌న్‌. పార్టీలు, ప్ర‌భుత్వాలు ఎలా ఉన్నా కేటీఆర్ లాంటి డైన‌మిక్ మినిస్ట‌ర్‌ను మిస్స‌య్యామంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. కేటీఆర్ లాంటి ఐటీ మినిస్ట‌ర్ మ‌ళ్లీ వ‌స్తారా ఉయ్ మిస్ యూ మినిస్ట‌ర్ కేటీఆర్ అంటూ సోష‌ల్ మీడియాలో హైద‌రాబాదీల‌తోపాటు ఆంధ్రా యూత్ కూడా పోస్టులు చేస్తుండ‌టం విశేషం.


First Published:  4 Dec 2023 1:11 PM IST
Next Story