Telugu Global
Telangana

రేషన్ కార్డు లేని వారి కూడా ఇందిరమ్మ ఇళ్లు : మంత్రి పొంగులేటి

రేషన్ కార్డు లేని నిరు పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజురు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

రేషన్ కార్డు లేని వారి కూడా ఇందిరమ్మ ఇళ్లు : మంత్రి పొంగులేటి
X

తెలంగాణలో రేషన్ కార్డు లేని నిరు పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజురు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఇందిరమ్మ కమీటీలు నిజమైన బెనిఫిట్ దారులను గుర్తిమస్తాన్నారు. విజయ దశమి నాటికి ఆ కమీటీలను అందుబాటులోకి తీసుకోస్తామన్నారు. గ్రామస్థాయి కమీటీలో సర్పంచ్. పర్సన్ ఇన్‌ఛార్జి, గ్రామ కార్యదర్మి, ముగ్గురు సేవా కార్యకర్తలుంటారని మంత్రి తెలిపారు. అవసరమైతే ఇళ్ల సంఖ్య పెంచుతామన్నారు. అక్టోబరు 15 నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వ హయంలో పూర్తయిన డబుల్ బెడ్ రూం ఇండ్లను అర్హులకు అందించే అంశంపై కేబినెట్‌లో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వనున్నట్లు వెల్లడించారు. వచ్చేనెల 2 నుంచి అర్హులకు హెల్త్‌కార్డులు, రేషన్‌ కార్డుల పంపిణీ ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు.

మంత్రి ప్రకటనతో ఇండ్లులేని నిరుపేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా ఇండ్లు మంజూరయ్యేలా చూడాలని కోరుతున్నారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాలకు ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లు మంజూరు చేసేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో తొలి విడతలో 4.50 లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. అర్హులకు ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు ఇవ్వనున్నారు. ఎస్సీ, ఎస్టీలకు మరో రూ.లక్ష అదనంగా కలిపి రూ.6 లక్షలు అందిస్తామని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించారు.ఎస్సీ, ఎస్టీలకు మరో రూ.లక్ష అదనంగా కలిపి రూ.6 లక్షలు అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇదివరకే ప్రకటించారు.

First Published:  27 Sept 2024 3:00 PM IST
Next Story