Telugu Global
Telangana

ఆ బీజేపీ ఎమ్మెల్యేలకు జైలు శిక్ష పడినా అనర్హత వేటు ఎందుకు వేయలేదు?

కర్నాట‌కలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలకు రెండేళ్ళకు పైగా జైలు శిక్ష పడినా ఇప్పటి వరకు వారిపై అనర్హత‌ వేటు వేయలేదు. మూడిగెరె బీజేపీ ఎమ్మెల్యే కుమారస్వామి కి చెక్ బౌన్స్ కేసులో నాలుగేళ్ళ జైలు శిక్ష పడింది. హావేరీ బీజేపీ ఎమ్మెల్యే నెహ్రూ ఓలేకర్ కు అవినీతి కేసులో రెండేళ్ళ జైలు శిక్ష పడింది.

ఆ బీజేపీ ఎమ్మెల్యేలకు జైలు శిక్ష పడినా అనర్హత వేటు ఎందుకు వేయలేదు?
X

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 2019 లో అన్న మాటలకు మోడీలకు పరువు నష్టం కలిగిందంటూ సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష విధించడం, వెంటనే ఆయనను పార్లమెంటు సెక్రటేరియట్ ఎంపీగా అనర్హుడంటూ ప్రకటించడం వెంట వెంటనే జరిగిపోయాయి. అదే బీజేపీ ఎమెల్యేలకో, ఎంపీలకో శిక్షలు పడితే బీజేపీ సర్కార్లు ఇలాగే స్పందిస్తాయా ? ఖచ్చితంగా స్పందించవనడానికి కర్నాటక గొప్ప ఉదహరణ.

కర్నాట‌కలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలకు రెండేళ్ళకు పైగా జైలు శిక్ష పడినా ఇప్పటి వరకు వారిపై అనర్హత‌ వేటు వేయలేదు.

కర్నాటక,మూడిగెరె బీజేపీ ఎమ్మెల్యే కుమారస్వామి కి చెక్ బౌన్స్ కేసులో నాలుగేళ్ళ జైలు శిక్ష పడింది. హావేరీ బీజేపీ ఎమ్మెల్యే నెహ్రూ ఓలేకర్ కు అవినీతి కేసులో రెండేళ్ళ జైలు శిక్ష పడింది.

మూడిగెరె ఎమ్మెల్యే కుమారస్వామి హెచ్‌ఆర్‌ హూవప్ప గౌడ అనే వ్యక్తి నుంచి రూ.1,38,65,000 కోట్ల రుణం తీసుకొని చెల్లని చెక్కులు ఇచ్చినందుకు గత నెల 13న కోర్టు నాలుగేండ్ల జైలు శిక్ష విధించింది.

హావేరీ ఎమ్మెల్యే నెహ్రూ ఓలేకర్, అతని కుమారులు మంజునాథ్‌ ఓలేకర్‌, దేవరాజ్‌ ఓలేకర్కు, హావేరీ పట్టణంలో జరిగిన అభివృద్ధి పనుల్లో అవినీతికి పాల్పడినట్టు రుజువైనందున కోర్టు రెండేళ్ళు జైలు శిక్ష విధించింది. హావేరీ పట్టణంలో కాంక్రీట్‌ రహదార్ల నిర్మాణం, ఇతర పనులను ఓలేకర్‌ తన కుమారులకే కాంట్రాక్టుకు ఇప్పించి రూ.50 లక్షల మేరకు అవినీతికి పాల్పడినట్టు నేరం రుజువైంది.

వీరిద్దరికీ శిక్షలు విధించి నెలరోజులకన్నా ఎక్కువ రోజులైనా వారిపై అనర్హత వేటు పడలేదు. రెండేళ్ళు, అంతకన్నా కన్నా ఎక్కువ జైలు శిక్ష పడిన వారు అటోమెటిక్ గా ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు అనర్హలవుతారన్న రూల్ వీరి విషయంలో ఎందుకు అమలవడంలేదు ? రాహుల్ గాంధీ విషయంలో మాత్రం ఆదరాబాదరాగా ఆయనను అనర్హడిగా ప్రకటించారు. రాహుల్ గాంధీ ఎనిమిదేళ్ళ వరకు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కూడా ఉండదు. కానీ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు మళ్ళీ బీజేపీ టికట్ మీదనే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

First Published:  28 March 2023 11:24 AM IST
Next Story