గుడికి వెళ్ళి ఏడ్చిన రేవంత్... గుడికి వెళ్ళడమేంటని విసుక్కున్న ఈటల
తాను డబ్బులు తీసుకోలేదంటూ భాగ్యలక్ష్మి అమ్మవారి ముందు ప్రమాణం చేస్తానని, ఈటల కూడా రావాలని నిన్న సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి అన్నట్టు గానే ఈ రోజు భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్ళి ప్రమాణం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురై కంట నీరు పెట్టుకున్నారు.
మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీని ఓడించేందుకు కేసీఆర్ వద్ద డబ్బులు తీసుకున్నారని బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ ఆరోపించిన నేపథ్యంలో ఈ రోజు రసవత్తర రాజకీయం జరిగింది.
తాను డబ్బులు తీసుకోలేదంటూ భాగ్యలక్ష్మి అమ్మవారి ముందు ప్రమాణం చేస్తానని, ఈటల కూడా రావాలని నిన్న సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి అన్నట్టు గానే ఈ రోజు భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్ళి ప్రమాణం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురై కంట నీరు పెట్టుకున్నారు.
"ఈటల రాజేంద్రా... నన్ను కేసీఆర్ కు అమ్ముడు పోయావ్ అంటావా.. నా ఆస్తి అంతా పోయినా సరే అధికార పార్టీ పైన కొట్లాడుతా" అంటూ తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. తాను కేసీఆర్ వద్ద ఒక్క పైసా తీసుకోలేదని,తన కుటుంబమంతా కేసీఆర్ తో పోరాడుతూనే ఉంటామని చెప్పారు.భయం తన రక్తంలో లేదని, తన చివరి రక్తపు బొట్టు వరకు కేసీఆర్ తో పోరాటం చేస్తానన్నారు. ''రాజేంద్రా... నాపై ఇష్టారీతిన మాట్లాడి, తెలంగాణ సమాజం ముందు తలదించుకునే పరిస్థితి తెచ్చుకోకు'' అని హెచ్చరించారు. మున్ముందు ఎవరిని ఎవరు గద్దె దించుతారో తెలుస్తుందన్నారు.
మరో వైపు ఈటల రాజేందర్ ఆలయానికి వెళ్ళకుండా తన ఇంట్లోనే ఉన్నారు. రేవంత్ ఆలయానికి వెళ్ళి ప్రమాణం చేయడంపై మండిపడ్డారు. ''అదేం కల్చర్ ? రాజకీయ నాయకుడికి కావాల్సింది కాన్ఫిడెన్స్. నీ మీద నీకు నమ్మకం లేకపోతే కదా దేవుడిపై విశ్వాసం. గుడికి వెళ్లి అమ్మతోడు.. అయ్యతోడు అనడం ఏంటి.'' అని ఆయన ప్రశ్నించారు.
తాను ఎవ్వరినీ కించపర్చడానికి ఆ మాటలు మాట్లాడలేదని, ఆత్మసాక్షిగా మాట్లాడానని, ఆదివారంనాడు అందరికీ సమాధానం చెప్తానని రాజేందర్ అన్నారు.