Telugu Global
Telangana

బీజేపీ నాలుగో లిస్ట్‌.. బండిపై ఈటల పైచేయి

వేములవాడ నుంచి టికెట్ ఆశించిన మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు కుమారుడు వికాస్‌రావుకు నిరాశే ఎదురైంది. ఆ స్థానంలో బీసీ సామాజికవర్గానికి చెందిన తుల ఉమాకు అవకాశం కల్పించారు.

బీజేపీ నాలుగో లిస్ట్‌.. బండిపై ఈటల పైచేయి
X

బీజేపీ నాలుగో లిస్ట్‌.. బండిపై ఈటల పైచేయి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు 12 మంది అభ్యర్థులతో కూడిన‌ నాలుగో జాబితా విడుదల చేసింది బీజేపీ. దీంతో ఇప్పటివరకూ 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. మొదటి విడతలో 52, రెండో విడతలో ఒక అభ్యర్థితో లిస్ట్ రిలీజ్ చేసిన బీజేపీ.. మూడో లిస్ట్‌లో 35 మందికి అవకాశం కల్పించింది. తాజాగా నాలుగో లిస్ట్ కూడా విడుద‌ల చేసింది.

ఇక నాలుగో లిస్ట్‌లో చెన్నూర్‌ నుంచి దుర్గం అశోక్, ఎల్లారెడ్డి వడ్జెపల్లి సుభాష్ రెడ్డి, వేములవాడ నుంచి తుల ఉమా, హుస్నాబాద్ నుంచి బొమ్మ శ్రీరాం చక్రవర్తి, సిద్దిపేట నుంచి దూది శ్రీకాంత్ రెడ్డిలకు పోటీచేసేందుకు అవకాశం కల్పించింది. వికారాబాద్‌ నుంచి పెద్దింటి నవీన్ కుమార్, కొడంగల్‌ నుంచి బంటు రమేష్ కుమార్, గద్వాల్‌- బోయ శివ, మిర్యాలగూడ సాదినేని శ్రీనివాస్, మునుగోడు నుంచి చలమల్ల కృష్ణారెడ్డి, నకిరేకల్‌ నుంచి నకరకంటి మొగులయ్య, ములుగు నుంచి అజ్మీరా ప్రహ్లాద్ నాయక్‌లను పోటీకి నిలిపింది.

వీరిలో చలమల్ల కృష్ణారెడ్డి, వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి ఇటీవలే పార్టీలో చేరి టికెట్ దక్కించుకున్నారు. ఇక వేములవాడ నుంచి టికెట్ ఆశించిన మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు కుమారుడు వికాస్‌రావుకు నిరాశే ఎదురైంది. ఆ స్థానంలో బీసీ సామాజికవర్గానికి చెందిన తుల ఉమాకు అవకాశం కల్పించారు. వేములవాడ, హుస్నాబాద్ అభ్యర్థులను పరిశీలిస్తే బండి సంజయ్‌పై ఈటల రాజేందర్ పైచేయి సాధించినట్లు అర్థమవుతోంది. ములుగులో మాజీ మంత్రి చందులాల్‌ తనయుడు అజ్మీరా ప్రహ్లాద్ నాయక్ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మరో 19 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. పొత్తులో భాగంగా జనసేనకు 8 స్థానాలు కేటాయిస్తారని తెలుస్తోంది. మిగిలిన స్థానాల్లో బీజేపీ అభ్యర్థులుబరిలో ఉండనున్నారు.

First Published:  7 Nov 2023 10:01 AM GMT
Next Story