కాంగ్రెస్‌లో చేరికపై ఈటల క్లారిటీ
ఈటల రాజేందర్ ఎన్నికలకు కొద్ది నెలల ముందు కూడా బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే ఆయన బీజేపీ తరపున సొంత నియోజకవర్గం హుజూరాబాద్ తో పాటు కేసీఆర్ పోటీ చేసిన గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు.
తాను బీజేపీని వీడటంలేదని.. కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. ఈటల త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరతారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆయనకు కరీంనగర్ ఎంపీ టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ హై కమాండ్ సిద్ధంగా ఉందని, అందుకోసం ఆయనను సంప్రదిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే పార్టీ మార్పుపై తాజాగా ఈటల రాజేందర్ స్పందించారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని స్పష్టంచేశారు.
కావాలనే ఆ పార్టీ తనపై దుష్ప్రచారం చేస్తోందని చెప్పారు. లేకపోతే బీజేపీలో ఉన్నవారే తాను పార్టీ వీడాలని ప్రయత్నాలు చేస్తున్నారేమోనన్నారు. తాను వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ఈటల చెప్పారు.
ఈటల రాజేందర్ ఎన్నికలకు కొద్ది నెలల ముందు కూడా బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే ఆయన బీజేపీ తరపున సొంత నియోజకవర్గం హుజూరాబాద్ తో పాటు కేసీఆర్ పోటీ చేసిన గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. అయితే ఊహించని విధంగా ఈటల పోటీచేసిన రెండు స్థానాల్లోనూ ఓటమి చెందారు. ఈటల రెండు స్థానాల్లో కాకుండా సొంత నియోజకవర్గం హుజూరాబాద్ లో మాత్రమే పోటీ చేసి ఉంటే గెలిచి ఉండేవారన్న వ్యాఖ్యలు వినిపించాయి.