BRS పేరు మార్చుతాం - ఎర్రబెల్లి దయాకర్ రావు
బీఆర్ఎస్‌గా పేరు మార్చిన తర్వాత కలిసిరావడం లేదని భావనలో పార్టీ నేతలు, క్యాడర్ ఉన్నారు. టీఆర్ఎస్ పేరుతో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. బీఆర్‌ఎస్‌గా పార్టీ పేరు మార్చాక ఓటమి చవి చూశారు.
BY Telugu Global6 April 2024 3:15 PM IST

X
Telugu Global Updated On: 6 April 2024 8:14 PM IST
బీఆర్ఎస్ పేరును తిరిగి టీఆర్ఎస్‌గా మార్చుతారంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఐతే దీనిపై క్లారిటీ ఇచ్చారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పార్టీ పేరును తిరిగి టీఆర్ఎస్‌గా మార్చేందుకు సమాలోచనలు జరుపుతున్నామన్నారు.
బీఆర్ఎస్‌గా పేరు మార్చిన తర్వాత కలిసిరావడం లేదని భావనలో పార్టీ నేతలు, క్యాడర్ ఉన్నారు. టీఆర్ఎస్ పేరుతో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. బీఆర్‌ఎస్‌గా పార్టీ పేరు మార్చాక ఓటమి చవి చూశారు.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పలువురు బీఆర్ఎస్ సీనియర్లు బహిరంగంగానే పార్టీ పేరు మార్పును తప్పుపట్టారు. తిరిగి టీఆర్ఎస్‌గా పేరు మార్చాలని సూచించారు. దీంతో ఆ దిశగా పార్టీ అధినాయకత్వం కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
Next Story