Telugu Global
Telangana

రాష్ట్రంలో ఎమర్జెన్సీ రోజులొచ్చాయి

ఇందిరమ్మ రాజ్యంలో ప్రశ్నిస్తే కేసులు, హక్కులు అడిగితే బెదిరింపులు, పోరాడాడితే సస్పెన్షన్లు చేస్తున్నారని కేటీఆర్‌ ఆగ్రహం

రాష్ట్రంలో ఎమర్జెన్సీ రోజులొచ్చాయి
X

పదేళ్లు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్న తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. పోలీస్‌ యాక్ట్‌ అమలు విషయమై 'ఎక్స్‌' వేదికగా ఆయన స్పందించారు. రాష్ట్రంలో ప్రభుత్వ చర్యలను కేటీఆర్‌ తప్పుపట్టారు. ప్రజాస్వామిక తెలంగాణలో.. బూటుకాళ్ల శబ్దాలతో తెల్లవారే రోజులొచ్చాయని వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రశ్నిస్తే కేసులు, హక్కులు అడిగితే బెదిరింపులు, పోరాడాడితే సస్పెన్షన్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది నియంతృత్వ రాజ్యమని.. కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్బంధిస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణకు పోరాటం కొత్తకాదు. ఈ మట్టి పొత్తిళ్లలోనే పోరాటం ఉందన్నారు. ప్రజాస్వామిక తెలంగాణ పునరుద్ధరణ కోసం పోరాడుతామన్నారు.

పంట దిగుబడిలోనే కాదు.. పశు సంపదలోనూ గణనీయ వృద్ధి

తెలంగాణలో పశు సంపద కారణంగా రూ. 2 వేల కోట్ల వృద్ధి జరిగిందని కేంద్రం ప్రకటించడంపై కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. గత పదేళ్లలో పంట దిగుబడిలోనే కాదు.. పశు సంపదలోనూ గణనీయ వృద్ధి సాధించిందని 'ఎక్స్‌' లో తెలిపారు. కులవృత్తులకు మాజీ సీఎం కేటీఆర్‌ అండగా ఉన్నందున.. పశు సంపదలోనూ గణనీయ వృద్ధి సాధించిందన్నారు. గ్రామీణ తెలంగాణ ఉపాధి పెంచాలనే ఆలోచన, సంపద సృష్టిలో గ్రామాలను భాగం చేయాలనే తపనతో గత ప్రభుత్వం పని చేసిందన్నారు. డిమాండ్‌కు తగ్గట్లుగా మాంసం, పౌల్ట్రీ ఉత్పత్తులను పెంచే ప్రయత్నం చేశామన్నారు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే దిగుబడికి కళ్లెం వేసినట్లైందన్నారు. కేసీఆర్‌ ప్రవేశపెట్టిన ప్రతీ పథకం దీర్ఘదృష్టితో తీసుకొచ్చిందేనని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో చేప పిల్లలు, గొర్రెల పంపిణీ లేదని ధ్వజమెత్తారు. కుల వృత్తులను రూపుమాపే కుట్ర చేస్తున్న కాంగ్రెస్‌ సర్కార్‌ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని ఆయన హితవు పలికారు

First Published:  2 Nov 2024 1:53 PM IST
Next Story