కేసీఆర్ స్పీచ్.. ఈసీ వార్నింగ్..!
అక్టోబర్ 30న ఎన్నికల ప్రచారంలో ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది.
మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి నేపథ్యంలో.. అక్టోబర్ 30న బాన్సువాడ ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన కామెంట్స్‌పై ఎలక్షన్ కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విద్వేషపూరిత ప్రసంగాలకు దూరంగా ఉండాలంటూ కేసీఆర్‌కు గట్టిగా సూచించింది.
అక్టోబర్ 30న ఎన్నికల ప్రచారంలో ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. వెంటనే ఆయనను హాస్పిటల్‌కు తరలించారు. దాడి జరిగిన సమయంలో సీఎం కేసీఆర్ బాన్సువాడ ప్రజా ఆశీర్వాద సభలో ఉన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని ఖండిస్తూ.. ఇంత మందిమి ఉన్నం.. మేం కత్తులు తీస్తే దుమ్ము రేగుతుందంటూ కామెంట్స్ చేశారు.
ECI issues strong advisory to CM KCR, Asks him to restrain from hate speech
— Sudhakar Udumula (@sudhakarudumula) November 24, 2023
The advisory comes in response to KCR's speech on October 30 in Banswada of Nizamabad, where he stated, "Our party workers too can pick up knives and create havoc in the state."
It also mentioned that… pic.twitter.com/yHjJi3IdtW
అయితే సీఎం కేసీఆర్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ NSUI తెలంగాణ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ నవంబర్ 3న ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న ఈసీ.. విద్వేషపూరిత ప్రసంగాలకు దూరంగా ఉండాలంటూ కేసీఆర్‌ను సూచించింది. విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినందుకు గతంలో కొన్ని పార్టీల గుర్తింపు రద్దు చేశామని.. కానీ బీఆర్ఎస్‌కు, కేసీఆర్‌కు తన ప్రసంగాలను సరిదిద్దుకునేందుకు ఓ అవకాశం ఇస్తున్నామని తన ప్రకటనలో తెలిపింది ఈసీ.