Telugu Global
Telangana

హారతి పళ్లెంలో డబ్బులేస్తున్నారా..? అభ్యర్థులూ..! జర జాగ్రత్త

బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ తరపున మంత్రి సత్యవతి రాథోడ్ ప్రచారం చేస్తున్నారు. కొంగరగిద్దలో ప్రచారానికి వెళ్లిన మంత్రి, ఇతర నేతలకు స్థానిక మహిళలు స్వాగతం పలికారు. మంగళహారతులిచ్చారు.

హారతి పళ్లెంలో డబ్బులేస్తున్నారా..? అభ్యర్థులూ..! జర జాగ్రత్త
X

తెలంగాణ ఎన్నికల వేళ ఈసీ టీమ్స్ అలర్ట్ గా ఉంటున్నాయి. ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరికినా అభ్యర్థులపై కేసులు నమోదు చేసేందుకు వెనకాడ్డంలేదు. తాజాగా మంత్రి సత్యవతి రాథోడ్ పై ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన (ఫీల్డ్ సర్వైవలెన్స్) టీమ్(FST) లు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాయి. ఆ ఫిర్యాదు మేరకు మంత్రిపై కేసు నమోదు కావడం విశేషం.

కేసెందుకు..?

బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ తరపున మంత్రి సత్యవతి రాథోడ్ ప్రచారం చేస్తున్నారు. కొంగరగిద్దలో ప్రచారానికి వెళ్లిన మంత్రి, ఇతర నేతలకు స్థానిక మహిళలు స్వాగతం పలికారు. మంగళహారతులిచ్చారు. ఆ హారతి పళ్లెంలో మంత్రి కరెన్సీ నోట్లను ఉంచారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకే ఇలా డబ్బులిచ్చారని FST బృందం మంత్రిపై ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదైంది.

అభ్యర్థులకు అలర్ట్..

హారతి పళ్లెంలో డబ్బులు ఉంచడం ఆనవాయితీ. ఎన్నికల వేళ కూడా ఇలాంటివి సర్వ సాధారణం. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉండగా.. అభ్యర్థులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఇలా బహిరంగంగా హారతి పట్టినవారికి డబ్బులు ఇవ్వడం, ఆ పళ్లెంలో వేయడం మాత్రం ఆక్షేపణీయం. అందుకే మంత్రిపై ఫీల్డ్ సర్వైవలెన్స్ బృందాలు ఫిర్యాదు చేశాయి. అభ్యర్థులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు నాయకులు. ఇష్టపూర్వకంగా, ఆనవాయితీ ప్రకారం హారతి పళ్లెంలో డబ్బులు వేసినా, అది ఓటర్లను ప్రలోభ పెట్టేందుకేనంటూ ఈసీ బృందాలు లెక్కగట్టేస్తున్నాయి. దీంతో అభ్యర్థులు షాకవుతున్నారు.

First Published:  17 Nov 2023 12:15 PM IST
Next Story