Telugu Global
Telangana

తెలంగాణలో ఎన్నికల సందడి.. తొలిరోజే 42 మంది నామినేషన్లు

మల్కాజిగిరి ఎంపీ స్థానం నుంచి ఈటల నామినేషన్ వేయగా.. మహబూబ్‌నగర్ నుంచి డి.కె.అరుణ నామినేషన్ దాఖలు చేశారు. మెదక్‌ నుంచి రఘునందన్‌ రావు, నాగర్‌కర్నూలు నుంచి మల్లు రవి, జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్‌ నామినేషన్లు ఫైల్ చేశారు.

తెలంగాణలో ఎన్నికల సందడి.. తొలిరోజే 42 మంది నామినేషన్లు
X

తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికల అధికారులు నోటిఫికేషన్ జారీ చేయడంతో.. నామినేషన్ల పర్వానికి తెరలేచింది.

తొలిరోజే 42 మంది అభ్యర్థులు 48 నామినేషన్ సెట్లు దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన వారిలో బీజేపీ లీడర్లు ఈటల రాజేందర్, డి.కె.అరుణ, రఘునందన్ రావు, శానంపూడి సైదిరెడ్డి, పోతుగంటి భరత్‌తో పాటు కాంగ్రెస్‌ లీడర్లు మల్లు రవి, సురేష్ షెట్కార్‌ మంచి ముహూర్తంలో నామినేషన్లు దాఖలు చేశారు.

మల్కాజిగిరి ఎంపీ స్థానం నుంచి ఈటల నామినేషన్ వేయగా.. మహబూబ్‌నగర్ నుంచి డి.కె.అరుణ నామినేషన్ దాఖలు చేశారు. మెదక్‌ నుంచి రఘునందన్‌ రావు, నాగర్‌కర్నూలు నుంచి మల్లు రవి, జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్‌ నామినేషన్లు ఫైల్ చేశారు.

ఈనెల 25 వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు తెలంగాణ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్‌. ఏప్రిల్‌ 26న నామినేషన్ల పరిశీలన జరుగుతుందన్నారు. ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉందన్నారు.

First Published:  19 April 2024 8:52 AM IST
Next Story