జమున ప్రెస్ మీట్.. ఈటల కవరింగ్ డ్రామానా..?
ఈ ఆరోపణలు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారా, న్యాయపోరాటం చేస్తున్నారా అనే విషయాలను మాత్రం ఆమె చెప్పలేదు. కేవలం ఈటల రాజేందర్ పార్టీ మార్పు వ్యవహారాన్ని డైవర్ట్ చేసేందుకే జమున ప్రెస్ మీట్ పెట్టినట్టు సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి.
తెలంగాణ బీజేపీలో ఈటల రాజేందర్ వ్యవహారం కొన్నిరోజులుగా కలకలం రేపుతోంది. ఈటల అసంతృప్తితో ఉన్నారని, ఆయన పార్టీ మారబోతున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీకి వెళ్లి మరీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అదే సమయంలో ఈ పార్టీ మార్పు ఎపిసోడ్ ని డైవర్ట్ చేయడానికి ఈటల భార్య జమున తెరపైకి వచ్చారు. తన భర్త హత్యకు కుట్ర జరుగుతోందంటూ ఆమె బాంబు పేల్చారు. 20కోట్ల రూపాయల డీల్ కుదిరినట్టు కూడా ఆరోపించారు. సీఎం కేసీఆర్ సూచనతో, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఈ హత్యకు కుట్ర చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మా ఆయన పార్టీ మారరు..
ఈటల రాజేందర్ పార్టీ మారరు అని క్లారిటీ ఇచ్చారు ఆయన భార్య జమున. అదే సమయంలో తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాను అని కూడా ఆమె చెప్పారు. తమని ఆర్థికంగా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ తమని టార్గెట్ చేశారని చెప్పుకొచ్చారు. దీనికోసం కౌశిక్ రెడ్డిని కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని, అసలు కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ సీటు ఈటల పుణ్యమేనని అన్నారు జమున.
అప్పుడెప్పుడో జమున హేచరీస్ కబ్జా పర్వం సమయంలో, హుజూరాబాద్ ఎన్నికల టైమ్ లో ఈటల భార్య తెరపైకి వచ్చారు. మళ్లీ ఇన్నాళ్లకు ఆమె సడన్ గా మీడియా ముందుకొచ్చారు. ఈటల హత్యకు కుట్ర అంటూ సంచలన ఆరోపణలు చేశారు. మరి ఈ ఆరోపణలు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారా, న్యాయపోరాటం చేస్తున్నారా అనే విషయాలను మాత్రం ఆమె చెప్పలేదు. కేవలం ఈటల రాజేందర్ పార్టీ మార్పు వ్యవహారాన్ని డైవర్ట్ చేసేందుకే జమున ప్రెస్ మీట్ పెట్టినట్టు సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి.