సోలార్ విద్యుత్‌పై మోడీ సర్కార్ కుట్రలు
సోలార్ పరికరాల మీద జీఎస్టీని 5 నుంచి 12 శాతానికి పెంచారని, దిగుమతి సుంకాన్ని కూడా పెంచారని రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TSREDCO) చైర్మన్ వై సతీష్ రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం సోలార్ ప్యానల్స్‌పై ఇచ్చే సబ్సిడీని క్రమంగా తగ్గిస్తున్నారని,15వ తేదీ తర్వాత సబ్సిడీలో భారీగా కోతలు విధించనున్నారని ఆయన చెప్పారు.
సోలార్ విద్యుత్తు పై సబ్సిడీ ఎత్తివేస్తూ, సోలార్ పరికరాలపై జీఎస్టీని పెంచుతూ సోలార్ విద్యుత్తును కేంద్ర సర్కార్ నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందనే విమర్శలు వస్తున్నాయి.
సోలార్ పరికరాల మీద జీఎస్టీని 5 నుంచి 12 శాతానికి పెంచారని, దిగుమతి సుంకాన్ని కూడా పెంచారని రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TSREDCO) చైర్మన్ వై సతీష్ రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం సోలార్ ప్యానల్స్‌పై ఇచ్చే సబ్సిడీని క్రమంగా తగ్గిస్తున్నారని,15వ తేదీ తర్వాత సబ్సిడీలో భారీగా కోతలు విధించనున్నారని ఆయన చెప్పారు. సోలార్ విద్యుత్ పరికరాల మీద ట్యాక్సులు, సుంకాలు పెంచుతూ వినియోగదారులకు సౌర విద్యుత్ దూరం చేస్తున్నారని ఆయన ఆరోపించారు..
ప్రస్తుతం ఇండ్లకు ఒక కిలోవాట్ పీక్ సోలార్‌కు రూ.21,320 సబ్సిడీ ఉన్నదని, 15వ తేదీ తర్వాత అది రూ.14,588 తగ్గిస్తున్నారని తెలిపారు. 5 కిలోవాట్ పీక్ సోలార్ ప్యానల్స్‌కు రూ.74,560 సబ్సిడీ ఉంటే, రూ.58,352కు, 10 కిలోవాట్ పీక్ సోలార్ వ్యవస్థకి రూ.1,21,160 సబ్సిడీ ఉంటే, రూ.94,822కి సబ్సిడీ తగ్గిపోనున్నదని తెలిపారు. అంటే వినియోగదారులపై రూ.26,338 భారం పడనున్నదని సతీష్ రెడ్డి వివరించారు
సోలార్ విద్యుత్తు పట్ల మోడీ సర్కార్ అనుసరిస్తున్న విధానాల వల్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన వాళ్లు కూడా వెనక్కి వెళ్ళిపోయారని చెప్పారు.
సోలార్ విద్యుత్తును నిర్లక్ష్యం చేస్తూ , నిర్వీర్యం చేస్తూ మరో వైపు సోలార్ విద్యుత్ ఎగుమతి చేస్తామని కేంద్రం చెప్పడం కేంద్ర రెండు నాల్కల ధోరణికి నిదర్శనమని సతీష్ రెడ్డి మండిపడ్డారు. మరో రెండు, మూడేండ్లలో సోలార్ విద్యుత్ పై పూర్తిగా సబ్సిడీ ఎత్తేసి ఆ రంగాన్ని నాశనం చేసే దిశగా కేంద్రం ఆలోచన చేస్తున్నదని అయన ఆరోపించారు. ఇప్పటికే మోడీ సర్కార్ విధానాల వల్ల 40 గిగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు నిలిచిపోయాయని సతీష్ రెడ్డి తెలిపారు.
మోడీ సర్కార్ అన్ని రంగాలను నాశనం చేసిన విధంగానే విద్యుత్ రంగాన్ని కూడా నాశనం చేసే కుట్ర చేస్తున్నదని సతీష్ రెడ్డి ఆరోపించారు.
ఎవరికి లాభాలు చేకూర్చేందుకు మోడీ సర్కార్ ఈ ప్రయత్నాలు చేస్తున్నది అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజల మీదనే ఉన్నది.