మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ సోదాలు
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు చెందిన ఆస్తులపై ఈడీ దాడులు
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 16 బృందాలు సీఆర్‌పీఎఫ్ పోలీసుల భద్రత మధ్య హైదరాబాద్‌లోని మంత్రి ఇంటితో పాటు ఆఫీసుల్లో తనిఖీలు చేస్తున్నాయి. అధికారులు ఏక కాలంలో 16 చోట్ల సోదాలు చేస్తున్నారు.హిమాయత్‌సాగర్‌లోని పొంగులేటి ఫాంహౌస్, ఆయన బంధువుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు జూబ్లీహిల్స్‌లోని పొంగులేటి కుమార్తె నివాసంలోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి.ఇటీవల నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును దక్కించుకున్న టెండర్లపై, రాఘవ నిర్మాణాలపై కాంగ్రెస్ శ్రేణులు, నేతల్లో చర్చ జరుగుతోంది. ఈ దాడులు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈడీ నిర్వహించిన గత సమస్యలకు సంబంధించినవని ఆ వర్గాలు తెలిపాయి.
కాగా.. గత ఏడాది నవంబర్లో పొంగులేటి నివాసాలపై ఈడీ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. నవంబర్ 3న ఖమ్మం పట్టణంలోని ఆయన నివాసాలతో పాటు హైదరాబాద్‌లోని నందగిరిహిల్స్‌లో ఉన్న ఇంట్లోనూ ఈడీ, ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. అలాగే బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 రాఘవా ప్రైడ్‌లో కూడా సోదాలు నిర్వహించారు.