గుడివాడ కేసినో సూత్రధారి చీకోటి ప్రవీణ్ అరెస్ట్ - ఎనిమిది చోట్ల ఈడీ దాడులు
గత జనవరిలో గుడివాడ కేసినో వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. నాటి ఆ వ్యవహారంలో కోట్లు చేతులు మారాయని, అమ్మాయిల చేత అసభ్య నృత్యాలు చేయించారని వచ్చిన ఆరోపణలు, ఇందులో ఈ కేసినోకు సూత్రధారిగా భావిస్తున్న చీకోటి ప్రవీణ్ ప్రమేయం ఉందని నాడు వచ్చిన వార్తలు కొన్ని రోజులపాటు పతాక శీర్షికలకెక్కాయి. సంక్రాంతి సందర్భంగా గుడివాడలో జరిగిన ఈ తతంగం టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఆనాడు మాటల యుద్దానికి దారి తీసింది. తనమీద టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వారి ఆరోపణలకు ఆధారాలు చూపాలంటూ. ప్రవీణ్ సవాలు చేశాడు. .. తాజాగా హైదరాబాద్ లో ఈడీ బుధవారం ఎనిమిది చోట్ల దాడులు చేసిన నేపథ్యంలో తిరిగి ప్రవీణ్ వార్తల్లోకి వచ్చాడు. ప్రవీణ్ ప్రస్తుతం హైదరాబాద్ లో కేసినో ఆడిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. గతంలోనే ఫెమా కింద ఇతనిపై సీబీఐ కేసు పెట్టింది కూడా..
ప్రవీణ్ తో బాటు ఇతని స్నేహితుడు మాధవరెడ్డి ఇంటిలోనూ ఇవాళ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. కేసినో లో గోవా బిగ్ డాడీ గా పాపులర్ అయిన చీకోటి లింకులు తిరిగి బయటపడుతున్నాయి. 2017 లోనూ హైదరాబాద్ లోని మారియట్ హోటల్లో కేసినో నిర్వహించినట్టు ఇతనిపై ఆరోపణలున్నాయి. గత జూన్ 11,12,13, 14 తేదీల్లో ఇతడు నేపాల్ లో కేసినో నిర్వహించాడట. ఎన్నోసార్లు పట్టుబడినా బయటపడుతూ వచ్చాడు. ఇప్పుడు ఇండో-నేపాల్ సరిహద్దు సిలిగురిలో కేసినో శిబిరాలు నిర్వహించాడన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు.. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానాల్లో పేకాటరాయుళ్లను నేపాల్ కు తరలించాడట.. ఇండోనేషియాను కూడా ప్రవీణ్ వదలలేదని ఆ దేశంలోనూ ఈ దందా నిర్వహించాడని తెలుస్తోంది.