మెదక్‌లో 106 మంది ప్రభుత్వ ఉద్యోగులపై వేటు.. ఎందుకంటే..?
వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారికి ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో మాజీ కలెక్టర్ సమావేశంలో పాల్గొన్న వారిపై సస్పెన్షన్ వేటు వేశారు.
BY Telugu Global9 April 2024 4:03 PM IST
X
Telugu Global Updated On: 9 April 2024 4:03 PM IST
మెదక్ జిల్లాలో 106 మంది ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ తగిలింది. రెండురోజుల క్రితం మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో కలిసి సమావేశంలో పాల్గొన్న 106 మంది ప్రభుత్వ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ సభలో పాల్గొనడంపై ఎన్నికల కమిషన్, సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి.
దీంతో వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారికి ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో మాజీ కలెక్టర్ సమావేశంలో పాల్గొన్న వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. సమావేశంలో పాల్గొన్న వారిని సీసీ కెమెరా ఆధారంగా గుర్తించిన అధికారులు వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వేటు పడిన వారిలో 40 మంది ఐకేపీ ఉద్యోగులు, 66 మంది NRGS ఉద్యోగులు ఉన్నారు.
Next Story