Telugu Global
Telangana

రేవంత్ పది నెలల పాలనలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత : బండి సంజయ్

రేవంత్ ప్రభుత్వ పది నెలల పాలనలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమర్ అన్నారు. కరీంనగర్‌లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గోన్నారు.

రేవంత్ పది నెలల పాలనలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత : బండి సంజయ్
X

కాంగ్రెస్ ప్రభుత్వ పది నెలల పాలనలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమర్ అన్నారు. కరీంనగర్‌లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గోన్నారు. బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్‌రెడ్డి నేతత్వంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు శరవేగంగా జరుగుతుందన్నారు. జమిలీ ఎన్నికలకు ఎన్డీయే సర్కార్ కట్టుబడి ఉందన్నారు. అమృత్ పథకం అక్రమాలపై ఫిర్యాదు చేస్తే కేంద్రం విచారిస్తుందని పేర్కొన్నారు. హస్తం పార్టీ అవినీతిలో కోరుకుపోయిందని, కొంతమంది కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతుందన్నారు. హైడ్రాకి వ్యతిరేకం కాదని నిస్పాక్షికంగా కూల్చివేతలు జరగాలన్నారు.

తిరుమల లడ్డు కల్తీ వివాదంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా దృష్టి సారించారని అన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఎంపీ అసద్దీన్ ఓవైసీ ఉగ్రవాదులనే పెంచి పోషిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. పాత బస్తీనీ రోహింగ్యాలకు, టెర్రరిస్ట్‌లకు అడ్డాగా మార్చారంటూ ఓవైసీపై విరుచుకుపడ్డారు. దేశంలో ఎక్కడ టెర్రరిస్టులు పట్టుబడ్డా వారిలో కచ్చితంగా ఒక్కరికైనా ఓల్డ్ సీటీతో లింకులు ఉంటాయని ఆరోపించారు.కాగా.. బండి సంజయ్‌కి ఇస్లామోఫోబియా పట్టుకుందని, అందుకే మదర్సాలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ శనివారం నాడు ఎంఐఎం పార్టీ మీటింగ్‌లో ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు నేడు (ఆదివారం) కౌంటర్ ఇచ్చిన బండి సంజయ్.

First Published:  22 Sept 2024 3:22 PM IST
Next Story