పాడి రైతులకు రూ.50 కోట్ల బకాయిలు విడుదల
పాల బిల్లులు విడుదల చేసిన విజయ డెయిరీ
BY Naveen Kamera23 Sept 2024 8:24 PM IST

X
Naveen Kamera Updated On: 23 Sept 2024 8:24 PM IST
విజయ డెయిరీకి పాలు పోసే పాడి రైతుల పెండింగ్ బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం రూ.50 కోట్లు విడుదల చేసింది. పాడి రైతుల పెండింగ్ బకాయిలను మంగళవారం చెల్లిస్తామని విజయ డెయిరీ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. పాల బిల్లుల చెల్లింపులో జరుగుతోన్న ఆలస్యంతో పాడి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, వారి బాధలను అర్థం చేసుకొనే బిల్లులు చెల్లించడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. పాడి రైతులు బిల్లుల విషయం ఆందోళన చెందొద్దని విజ్ఞప్తి చేశారు. మార్కెట్ ధర కన్నా విజయ డెయిరీ ఎక్కువ మొత్తమే చెల్లించి పాలు కొనుగోలు చేస్తుందని, బిల్లుల చెల్లింపులో ఆలస్యం అయినందున రైతులు ఆందోళన చెందొద్దని విజ్ఞప్తి చేశారు. రూ.50 కోట్ల చెల్లింపులు పూర్తయిన తర్వాత మిగతా బకాయిలను వీలైనంత త్వరలోనే చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
Next Story