నేడు డీఎస్సీ ఫలితాలు విడుదల
సెక్రటేరియట్‌లో ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేయనున్నారు.
BY Raju Asari30 Sept 2024 2:07 AM

X
Raju Asari Updated On: 30 Sept 2024 2:09 AM
తెలంగాణ డీఎస్సీ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. సెక్రటేరియట్‌లో ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. 11,062 ఉపాధ్యాయ పోస్టులకు ప్రభుత్వం మార్చి 1న డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఈ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 2.45 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు.
Next Story