Telugu Global
Telangana

రెండురోజుల్లో తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్

మొత్తంగా 6,500 కి పైగా పోస్టులను తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేయడానికి రెడీ అయింది. నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత నియామక ప్రక్రియ కూడా వేగవంతంగా పూర్తి చేస్తామని చెప్పారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

రెండురోజుల్లో తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్
X

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడబోతోంది. ఈ మేరకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. నోటిఫికేషన్ కు సర్వం సిద్ధమైనట్టు వెల్లడించారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రెండు రోజుల్లో ఉపాధ్యాయ ఉద్యోగ నియామక ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడుతుందని ఆమె ప్రకటించారు.

పాఠశాల విద్యలో ఉన్న పోస్ట్ లు 5,089

స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ స్కూళ్లలోని పోస్ట్ లు 1,523

మొత్తంగా 6,500 కి పైగా పోస్టులను తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేయడానికి రెడీ అయింది. నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత నియామక ప్రక్రియ కూడా వేగవంతంగా పూర్తి చేస్తామని చెప్పారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. నియామకాల విషయంలో ఇప్పటికే తెలంగాణలో భారీ సంఖ్యలో నోటిఫికేషన్లు ఇచ్చామని, ఇప్పుడు డీఎస్సీ ద్వారా 6,500 కి పైగా పోస్ట్ లు భర్తీ చేస్తున్నట్టు ప్రకటించారు.

ప్రతిపక్షాల విసుర్లు..

డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల ప్రకటనతో ప్రతిపక్షాలు డైలమాలో పడ్డాయి. ఎన్నికల సమయంలో ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ తో కచ్చితంగా యువత బీఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతారని అంచనా వేస్తున్నారు కాంగ్రెస్, బీజేపీ నేతలు. ఓవైపు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ మొదలైంది, మరోవైపు వికలాంగుల పింఛన్ పెంచారు, సామాజిక పింఛన్ల పెంపుపై ఊహాగానాలున్నాయి. ఈ దశలో డీఎస్సీ నోటిఫికేషన్ అనగానే ప్రతిపక్షాలు మాత్రం షాక్ కి గురయ్యాయి.

First Published:  24 Aug 2023 8:25 AM GMT
Next Story