జీవన్ దాన్ నోడల్ ఆఫీసర్ గా శ్రీభూషణ్ రాజు
నిమ్స్ నెఫ్రాలజీ హెడ్ కు కీలక బాధ్యతలు
BY Naveen Kamera8 Nov 2024 3:08 PM IST
X
Naveen Kamera Updated On: 8 Nov 2024 3:08 PM IST
నిమ్స్ హాస్పిటల్ నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ శ్రీభూషణ్ రాజును రాష్ట్ర ప్రభుత్వం జీవన్‌దాన్ నోడల్ ఆఫీసర్ గా నియమించింది. కోటి డీఎంఈ ఆఫీస్ లో డీఎంఈ డాక్టర్ ఎన్.వాణి శుక్రవారం నియామకపత్రాన్ని డాక్టర్ శ్రీభూషణ్ రాజుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ సీనియర్ ప్రొఫెసర్ గా కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులకు మెరుగైన ట్రీట్ మెంట్ చేస్తున్నానని.. జీవన్‌దాన్ ద్వారా అర్హులైన వారికి కిడ్నీ రీప్లేస్మెంట్ సర్జరీలు చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు మరింత పారదర్శకమైన సేవలందించేలా తాను కృషి చేస్తానని తెలిపారు. జీవన్ దాన్ నోడల్ ఆఫీసర్ గా నియమితులైన శ్రీభూషణ్ రాజును పలువురు వైద్యులు అభినందించారు.
Next Story