Telugu Global
Telangana

ఆగస్టు మొదటివారం నుంచి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ -కేటీఆర్

ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందేలా చూడాలని మంత్రి కేటీఆర్ ఆదేశించడంతో అత్యంత జాగ్రత్తగా ఈ ఎంపిక ప్రక్రియ చేపట్టాలని GHMC నిర్ణయించింది.

ఆగస్టు మొదటివారం నుంచి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ -కేటీఆర్
X

హైదరాబాద్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకోసం ఎదురు చూస్తున్న పేద ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి కేటీఆర్. ఆగస్ట్ మొదటి వారం నుంచి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ మొదలవుతుందని ప్రకటించారు. అక్టోబర్ మూడో వారం వరకు దాదాపు 70వేల ఇళ్లను పేదలకు అందించబోతున్నట్టు ఆయన తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.


లక్ష ఇళ్ల లక్ష్యంగా..

తెలంగాణలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అందిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం శరవేగంగా ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు అడుగులు వేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లక్ష ఇళ్ల లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే దాదాపుగా 70వేల ఇళ్ల నిర్మాణం తుది దశకు చేరుకుంది. వీటి పంపిణీ ఆగస్ట్ మొదటి వారం నుంచి మొదలవుతుందని తెలిపారు మంత్రి కేటీఆర్.

నిర్మాణం పూర్తి చేసుకొని పంపిణీకి సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందించేందుకు GHMC ఒక షెడ్యూల్ సిద్ధం చేసింది. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన అంశంలో రెవెన్యూ యంత్రాంగం సహాయం తీసుకుంటుంది. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందేలా చూడాలని మంత్రి కేటీఆర్ ఆదేశించడంతో అత్యంత జాగ్రత్తగా ఈ ఎంపిక ప్రక్రియ చేపట్టాలని GHMC నిర్ణయించింది.

ఇప్పటి వరకు 4వేల ఇళ్లను లబ్ధిదారులకు అందించగా.. ఆగస్ట్ మొదటి వారం నుంచి భారీ ఎత్తున ఈ కార్యక్రమం మొదలు కాబోతోంది. అక్టోబర్ మూడో వారం వరకు దాదాపు 6 దశల్లో ఇప్పటికే పూర్తయిన ఇళ్లను పేదలకు అందిస్తారు. వీటికి అదనంగా నిర్మాణం తుది దశలో ఉన్న ఇళ్లను కూడా ఎప్పటికప్పుడు పేదలకు పంపిణీ చేస్తారు.

First Published:  19 July 2023 4:55 PM GMT
Next Story