Telugu Global
Telangana

10 లక్షల ఎకరాల్లో పంటలు ఎండినా ప్రభుత్వాన్ని పట్టింపు లేదా?

ఇదేనా కాంగ్రెస్‌ మార్క్‌ రైతు సంక్షేమ రాజ్యమంటే?అని కేంద్ర మంత్రి సంజయ్‌ ఫైర్‌

10 లక్షల ఎకరాల్లో పంటలు ఎండినా ప్రభుత్వాన్ని పట్టింపు లేదా?
X

రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల్లో పంటలు ఎండినా ప్రభుత్వాన్ని పట్టింపు లేదా? అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 'అన్నదాతల ఆక్రందనలు వినిపించడం లేదా? కాలువల్లో నీళ్లున్నా ఎందుకు వదలడం లేదు? రాష్‌ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఎందుకు మూల్యం చెల్లించాలి? దీన్ని కూడా కేంద్రంపై నెట్టేసి తప్పించుకోవాలనుకుంటున్నార? అని ఫైర్‌ అయ్యారు. రైతు భరోసా ఇవ్వరు.. రుణమాఫీ పూర్తి చేయరు.. పంట నష్టపరిహారం ఇవ్వరు. ఇదేనా కాంగ్రెస్‌ మార్క్‌ రైతు సంక్షేమ రాజ్యమంటే? అని నిలదీశారు. రాజకీయ నాయకుల స్టేచర్‌ గురించి కాదు.. రైతుల ఫ్యూచర్‌ ఆలోచించండి. అసెంబ్లీలో తక్షణమే రైతు సమస్యలపై చర్చించండి. కష్టాల్లో ఉన్న అన్నదాతలను ఆదుకునే చర్యలు చేపట్టండి. యాసంగి పూర్తయ్యే వరకు నీళ్లు వదలండి అని బబడి సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

First Published:  13 March 2025 11:07 AM IST
Next Story