Superstar Krishna Health Condition: కృష్ణ ఆరోగ్యంపై ఇప్పుడే ఏమీ చెప్పలేం..- వైద్యులు
Superstar Krishna Health Condition: రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు మరోసారి బులిటెన్ విడుదల చేస్తామన్నారు. వైద్యానికి శరీరం సహకరిస్తుందా.. లేదా అన్నది ఊహించుకుని తాము చెప్పలేమన్నారు. స్పష్టతకు 24 గంటలు పట్టవచ్చన్నారు

సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు వైద్యులు. తీవ్ర గుండెపోటు రావడంతో అర్ధరాత్రి కృష్ణను ఆస్పత్రికి తీసుకొచ్చారని వైద్యులు వెల్లడించారు. కృష్ణ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందన్నారు. వెంటిలేటర్‌పై వైద్యం అందిస్తున్నామన్నారు. 24 గంటల తర్వాతనే కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత ఇవ్వగలమన్నారు.
హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో కృష్ణకు వైద్యం అందిస్తున్నారు. ఇప్పటికిప్పుడు పరిస్థితి ఏంటి అన్న దానిపై తాము ఏమీ చెప్పలేమని.. ప్రస్తుత పరిస్థితికి తగ్గట్టుగానే వైద్యం అందిస్తున్నట్టు వైద్యులు చెప్పారు. రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు మరోసారి బులిటెన్ విడుదల చేస్తామన్నారు. వైద్యానికి శరీరం సహకరిస్తుందా.. లేదా అన్నది ఊహించుకుని తాము చెప్పలేమన్నారు. స్పష్టతకు 24 గంటలు పట్టవచ్చన్నారు. ప్రస్తుతానికి కృష్ణ పరిస్థితి అత్యంత విషమంగానే ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో అందే వైద్యం కాంటినెంటల్ ఆస్పత్రిలో అందిస్తున్నట్టు చెప్పారు.