Telugu Global
Telangana

గ్రూప్-2 ఫస్ట్ ర్యాంకర్ ఎవరో తెలుసా?

గ్రూప్‌ -2 పరీక్ష ఫలితాల్లో తొలి ర్యాంకు సూర్యపేట జిల్లా కోదాడ వాసి నారు వెంక‌ట హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి సాధించారు.

గ్రూప్-2 ఫస్ట్ ర్యాంకర్ ఎవరో తెలుసా?
X

తెలంగాణ గ్రూప్‌ -2 పరీక్ష ఫలితాల్లో ఫస్ట్ ర్యాంకు సూర్యపేట జిల్లా కోదాడ వాసి నారు వెంక‌ట హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి సాధించారు. 600 మార్కులకు గాను 447.088 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచారు. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ తండ్రి ర‌మ‌ణారెడ్డి కోదాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. హర్షవర్ధన్ రెడ్డి ఏడో తరగతి వరకు ఖమ్మం కేంద్రీయ విద్యాలయంలో, 8 నుంచి 10వ త‌ర‌గ‌తి వరకు విజయవాడ నలంద విద్యాలయంలో, ఆ తర్వాత ఇంటర్ శ్రీ చైతన్య కాలేజీలో, బీటెక్ తాడేపల్లిగూడెం నిట్‌లో చదివారు. ఎటువంటి కోచింగ్ లేకుండా ప్రణాళిక బద్ధంగా చదవటం వల్లే తాను ఈ ర్యాంకు సాధించినట్టు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలోనే ప్రథమ ర్యాంకు సాధించిన హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డికి శుభాకాంక్ష‌లు వెలువెత్తుతున్నాయి.వడ్లకొండ సచిన్‌ రెండో ర్యాంకు, బి. మనోహర్‌ రావు మూడో ర్యాంకులతో సత్తా చాటారు. టాప్‌- 31 ర్యాంకుల్లో అందరూ అబ్బాయిలే ఉండటం గమనార్హం. రాష్ట్రంలో 783 గ్రూప్‌ -2 ఉద్యోగాల భర్తీకి గతేడాది డిసెంబర్‌లో పరీక్షలు నిర్వహించిన టీజీపీఎస్సీ.. మంగళవారం మధ్యాహ్నం ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే.

గ్రూప్‌ -2 టాప్‌ -10 ర్యాంకర్ల జాబితా ఇదే..

1. నారు వెంకట హర్షవర్దన్‌ (447.088 మార్కులు)

2. వడ్లకొండ సచిన్‌ (444.754 మార్కులు)

3. బి మనోహర్‌రావు (439.344 మార్కులు)

4. శ్రీరామ్‌ మధు (438.972 మార్కులు)

5. చింతపల్లి ప్రీతమ్‌ రెడ్డి (431.102 మార్కులు)

6. అఖిల్‌ ఎర్రా (430.807 మార్కులు)

7. గొడ్డేటి అశోక్‌ (425.842 మార్కులు)

8. చిమ్ముల రాజశేఖర్‌ ( 423.933 మార్కులు)

9. మేకల ఉపేందర్‌ (423.119 మార్కులు)

10. కరింగు నరేష్‌ (422.989 మార్కులు)

First Published:  11 March 2025 9:02 PM IST
Next Story