తెలంగాణకు డీకే శివకుమార్.. అందుకేనా..?
కాంగ్రెస్ MLAలను బెంగుళూరు శివారులోని క్యాంపునకు తరలించేలా ప్లాన్ చేశారు. ప్రత్యేక విమానాల్లో, లేదంటే ప్రత్యేక బస్సుల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూర్ పంపుతారు
తెలంగాణ కాంగ్రెస్‌పై అధిష్టానం ఓ కన్నేసి ఉంచింది. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా చర్యలు చేపట్టింది. అందుకే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను రంగంలోకి దింపింది. అధిష్టానం ఆదేశాలతో హైదరాబాద్‌కు వస్తున్నారు డీకే. మూడు రోజులు తెలంగాణలోనే మకాం వేయనున్నారు. ఎగ్జిట్ ఫలితాల మాదిరి మెజారిటీ వస్తే.. ఎవరూ చేజారిపోకుండా ఉండేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోసం క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య బొటాబొటీ ఫలితాలు వస్తే మాత్రం కాంగ్రెస్ MLAలను బెంగుళూరు శివారులోని క్యాంపునకు తరలించేలా ప్లాన్ చేశారు. ప్రత్యేక విమానాల్లో, లేదంటే ప్రత్యేక బస్సుల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూర్ పంపుతారు.
ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం అప్రమత్తమైంది. కేసీఆర్ తమ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నారని డీకే ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు జంప్ కాకుండా చూసుకునే బాధ్యతను డీకేకు అప్పగించింది కాంగ్రెస్ అధిష్టానం. గెలుస్తారు అనుకున్న నేతలందరికీ టచ్‌లోకి వెళ్లారు డీకే. ఎవరికి ఆఫర్ వచ్చినా పార్టీకి సమాచారం ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం మనదే అంటూ కాంగ్రెస్ నాయకులకు భరోసా ఇస్తున్నారు. అధికారం మాదే అని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ.. అసలైన ఫలితాలు వచ్చేదాకా ఏం చెప్పలేని పరిస్థితి నెలకొంది.