Telugu Global
Telangana

సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కులు పంపిణీ ..ఒక్కో కార్మికుడికి రూ.1.90 లక్షలు

సింగరేణి సిరులు తెలంగాణ రాష్ట్రానికే తలమానికమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రజాభవన్‌లో సింగరేణి కార్మికులకు దసరా బోనస్ చెక్కుల పంపిణీ చేశారు

సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కులు పంపిణీ ..ఒక్కో కార్మికుడికి రూ.1.90 లక్షలు
X

తెలంగాణలో సింగరేణిపై ఆధారపడి ఎన్నో వేల కుటుంబలు జీవిస్తున్నాయని బోగ్గు కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజాభవన్‌లో సింగరేణి కార్మికులకు దసరా బోనస్ చెక్కుల పంపిణీ చేశారు. 2023-24 ఏడాదిలో సింగరేణి లాభం రూ.4,701 కోట్లు నమోదయ్యింది. సింగరేణి కార్మికులకు సంతోషంగా బోనస్‌ ప్రకటిస్తున్నాన్నారు. సింగరేణి కార్మికులకు రూ.796 కోట్లు బోనస్‌గా ప్రకటించాం. ఒక్కో కార్మికుడికి సగటున రూ.1.90 లక్షలు బోనస్‌ వస్తుంది. సింగరేణిలో శాశ్వత ఉద్యోగులు 41,837. సింగరేణిలో ఒప్పంద ఉద్యోగులకు కూడా బోనస్‌ ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు.

అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున సింగరేణి కార్మికులకు అవసరమైన అన్ని సదుపాయాలను ఏర్పాటుచేస్తామని ఆయన తెలిపారు. రూ.2412 కోట్ల లాభం రాగా అందులో 33 శాతం రూ.796 కోట్లను కార్మికులకు బోనస్ గా ప్రకటించిమని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. సింగరేణిలోని కాంట్రాక్ట్ కార్మికుల కూడా రూ. 5 వేల బోనస్ ఇస్తామన్న భట్టి అన్నారు. గుండు సూది కూడా ఉత్పత్తి చేసుకోలేని భారతదేశాన్ని మిశ్రమ ఆర్థిక విధానంతో గొప్ప పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దిన నేత దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు అని.. ఆయన అడుగు జాడల్లో నడుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం.

First Published:  7 Oct 2024 2:42 PM IST
Next Story