Telugu Global
Telangana

ఈటల రాజేందర్‌పై అనర్హత వేటు తప్పదా ?

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై అనర్హత వేటు పడనుందా ? ఈటల స్పీకర్ కు క్షమాపణ చెప్పాలని లేదంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈటల రాజేందర్‌పై అనర్హత వేటు తప్పదా ?
X

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై అనర్హత వేటు పడనుందా ? ఆయన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై చేసిన అభ్యంతరకర ఆరోపణలతో ప్రభుత్వ ఆగ్రహంగా ఉంది. అసెంబ్లీ స్పీకర్‌ను మరమనిషి అంటూ ఈటల చేసిన విమర్శలపై మంత్రి ప్రశాంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. సభాపతిని మరమనిషి అని కించపరుస్తూ ఈటల మాట్లాడటం దుర్మార్గమని, తక్షణం ఆయన క్షమాపణ చెప్పాలని లేదంటే ఆయనపై చ‌ట్ట ప్రకారం చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.

కాగా ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను త్వరగా ముగించడంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఒక మర మనిషి లాగా వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం చెప్పింది చేయడం తప్ప.. స్పీకర్‌‌ పోచారానికి వేరే పని లేదని ఈటల విమర్షించారు.

ఈటల చేసిన ఈ వ్యాఖ్యలపై స్పీకర్ కూడా బాధపడ్డట్టు తెలుస్తోంది. పలువురు మంత్రులు ఈటలపై చర్యలు తీసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. అసెంబ్లీ నుంచి ఈటల‌ను బహిష్కరించాలని సభలో తీర్మానం ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

First Published:  6 Sept 2022 4:47 PM GMT
Next Story