భట్టి వర్సెస్ రేణుక.. ఖమ్మం కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు
రేణుకా చౌదరి వ్యాఖ్యలపై భగ్గుమన్నారు భట్టి వర్గీయులు. ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉండి ఇప్పుడు వచ్చి నీతులు చెప్పొద్దంటూ రేణుకా చౌదరిపై మండిపడ్డారు.
ఖమ్మం కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఈ సారి రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఖమ్మంలో ఇవాళ నిర్వహించిన మీటింగ్‌లో మాట్లాడిన రేణుకా చౌదరి.. పదవులు కావాలి.. కానీ మీటింగ్‌లకు రారు అంటూ భట్టిని ఉద్దేశించి పరోక్షంగా కామెంట్స్ చేశారు.
నువ్వూ ఎవడ్రా చెప్పడానికి.. ఖమ్మం కార్యకర్తల సమావేశంలో కార్యకర్త పై రేణుక చౌదరి ఫైర్.
— Telugu Scribe (@TeluguScribe) April 30, 2024
మండల ప్రెసిడెంట్లు అని ఎవరెవరో కూర్చున్నారు, అందరూ నాకు కనపడటం లేదు.. అన్ని ఏరియాస్ నుంచి మండల ప్రెసిడెంట్స్ రాలేదు..
ఇంత నిర్లక్ష్యం చేయడం వీలు కాదు, పదవుల కోసం పాకులాడటం, చిల్లర వేషాలు,… pic.twitter.com/GR6eMpDaQO
రేణుకా చౌదరి వ్యాఖ్యలపై భగ్గుమన్నారు భట్టి వర్గీయులు. ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉండి ఇప్పుడు వచ్చి నీతులు చెప్పొద్దంటూ రేణుకా చౌదరిపై మండిపడ్డారు. మంత్రులు పొంగులేటి, తుమ్మల సమక్షంలోనే ఈ గొడవ జరగడం గమనార్హం.
ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రసాభాస
— Telugu Scribe (@TeluguScribe) April 30, 2024
మూడు వర్గాలుగా విడిపోయి, ఒక వర్గం పై ఇంకొక వర్గం విమర్శలు..
ఎంపీ రేణుక చౌదరి, ఉపముఖ్యమంత్రి భట్టి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఎంత నచ్చచెప్పిన వినని కార్యకర్తలు. pic.twitter.com/ltEYQu3R8S
ఇక రేణుకాచౌదరి, భట్టి విక్రమార్క చాలా రోజులుగా విభేదాలు ఉన్నాయి. భట్టిని టార్గెట్ చేసుకుని చాలాసార్లు రేణుకాచౌదరి నేరుగానే విమర్శలు చేశారు. ఎంపీ ఎన్నికల వేళ బహిరంగంగా ఇలా విభేదాలు బయటపడడం ఖమ్మం జిల్లా పాలిటిక్స్‌లో చర్చనీయాంశమైంది.