Telugu Global
Telangana

సీఎం కాదు.. సీతక్క చుట్టే వివాదం..!

డిప్యూటీ సీఎం పదవి ఒకటే ఉండాలని.. అది తనే ఉండాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలక శాఖలు, పీసీసీ పదవి తనకు ఇవ్వాలని భట్టి హైకమాండ్‌ను డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.

సీఎం కాదు.. సీతక్క చుట్టే వివాదం..!
X

తెలంగాణలో ముఖ్యమంత్రి ఎవరనేది దాదాపు ఫైనల్ అయిపోయింది. ప్రస్తుతం పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డి పేరును సీఎం పదవికి అధిష్టానం ఖరారు చేసిందని సమాచారం. ఇప్పుడు సీఎం ఎవరనే విషయంలో ఎలాంటి వివాదం లేదు. మెజార్టీ ఎమ్మెల్యేలు సైతం రేవంత్‌ను సీఎంగా అంగీకరించారు. కానీ, ఇప్పుడు వివాదమంతా మిగిలిన డిప్యూటీ సీఎం, మంత్రి పదవుల విషయంలోనే. ప్రధానంగా సీతక్కకు డిప్యూటీ సీఎం పదవి విషయంలోనే రచ్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

సీఎంతో పాటు రెండు డిప్యూటీ సీఎంల ఫార్మూలాను అధిష్టానం ప్రతిపాదించింది. ఇందులో ఒక డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క ఖరారు కాగా.. మరో డిప్యూటీ సీఎం పదవి సీతక్కకు ఇవ్వాలన్నది రేవంత్ డిమాండ్‌. ఇక్కడే పీటముడి పడింది. సీతక్కకు డిప్యూటీ సీఎం ఇవ్వాలన్న రేవంత్‌ డిమాండ్‌కు భట్టి విక్రమార్క నో చెప్పినట్లు తెలుస్తోంది.

డిప్యూటీ సీఎం పదవి ఒకటే ఉండాలని.. అది తనే ఉండాలని భట్టి పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలక శాఖలు, పీసీసీ పదవి తనకు ఇవ్వాలని భట్టి హైకమాండ్‌ను డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

First Published:  5 Dec 2023 1:26 PM IST
Next Story