ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. రేవంత్ Vs కేటీఆర్ డైలాగ్ వార్
ఎవరి ఇంటెలిజెన్స్ ఎంతో ప్రజలు తెలుస్తారన్నారు కేటీఆర్. తాను చదువుకుని వచ్చానని, తాను రెండు మాస్టర్ డిగ్రీలు చేశానన్నారు. పుణేలో బయోటెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేశానని, తర్వాత న్యూయార్క్ వెళ్లి MBA పూర్తి చేశానన్నారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆసక్తికరంగా జరుగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సబ్జెక్టు, సెటైర్లు, పంచ్‌లతో నేతలు సమావేశాలను రక్తి కట్టిస్తున్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ల మధ్య ఇంట్రెస్టింగ్ చర్చ జరిగింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి సభలో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ఐటీ నుంచి AI వైపు టెక్నాలజీ వెళ్తుందన్నారు రేవంత్. 200 ఎకరాల్లో AI సిటీని నిర్మించేందుకు అధికారులతో రోజుకూ 18 గంటలు సమన్వయం చేసుకుంటున్నానని చెప్పారు. ఇక కేటీఆర్‌కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధం ఉందన్న రేవంత్.. కేటీఆర్ ఆర్టిఫిషియల్, ఇంటెలిజెన్స్ జీరో అంటూ కామెంట్స్ చేశారు.
ఇక సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు కేటీఆర్. ఎవరి ఇంటెలిజెన్స్ ఎంతో ప్రజలు తెలుస్తారన్నారు కేటీఆర్. తాను చదువుకుని వచ్చానని, తాను రెండు మాస్టర్ డిగ్రీలు చేశానన్నారు. పుణేలో బయోటెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేశానని, తర్వాత న్యూయార్క్ వెళ్లి MBA పూర్తి చేశానన్నారు. ఉద్యోగం కూడా చేశానన్నారు. గుంటూరులో ఇంటర్మీడియట్ చదువుకున్నానని, ఈ విషయాలు చెప్పడానికి తనకేమి అభ్యంతరం లేదన్నారు కేటీఆర్. సర్టిఫికెట్లు చూపించే పరిస్థితి తనకుందన్నారు. రేవంత్ ఏం చదువుకున్నారో, ఎక్కడ చదువుకున్నారో తెలియదన్నారు కేటీఆర్. పోటీ పరీక్షలు రాశానని, ఇంటర్వ్యూలకు కూడా హాజరయ్యానన్నారు కేటీఆర్. ముఖ్యమంత్రి గతమెంటో తనకు తెలియదని, రకరకాలుగా ప్రచారం జరుగుతోందన్నారు కేటీఆర్. రేవంత్ అదృష్టవంతుడన్నారు. రేవంత్ రెడ్డితో తనకు 18-20 ఏళ్ల పరిచయం ఉందని, చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నామన్నారు. అయితే గత పది సంవత్సరాల్లో ఇద్దరి మధ్య చెడిందన్నారు. కష్టపడడంతో రేవంత్ సీఎం అయ్యారని చెప్పుకొచ్చారు కేటీఆర్.