Telugu Global
Telangana

రెండో పెళ్లి చేసుకున్న డైరెక్టర్‌ క్రిష్‌

టాలీవుడ్ దర్మకుడు క్రిష్, ప్రముఖ గైనకాలజిస్ట్ ప్రీతి చల్లాను పెళ్లి చేసుకున్నాడు. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

రెండో పెళ్లి చేసుకున్న  డైరెక్టర్‌ క్రిష్‌
X

టాలీవుడ్ దర్మకుడు క్రిష్, ప్రముఖ గైనకాలజిస్ట్ ప్రీతి చల్లాను పెళ్లి చేసుకున్నాడు. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈనెల 16న రిసెప్షన్ కూడా ఉంటుందని.. దీనికి సినీ ప్రముఖులు హాజరు అవ్వనున్నట్టు సమాచారం. వాస్తవానికి డైరెక్టర్ క్రిష్ 2016లోనే మ్యారేజ్ చేసుకున్నారు. అప్పుడు కూడా ఓ డాక్టర్ ని వివాహం చేసుకున్నారు. ఆ డాక్టర్ తో విభేదాలు కారణంగా 2018లో వీరిద్దరూ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.

క్రిష్ మళ్లీ డాక్టర్ ని పెళ్లి చేసుకోవడంతో సోషల్ రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక 2008 లో గమ్యం సినిమాకు దర్శకత్వం వహించిన క్రిష్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. తర్వాత వేదం, గౌతమపుత్ర శాతకర్ణి, కొండపాలం వంటి సినిమాలను తెరకెక్కించాడు. కానీ పలు చిత్రాలు బాక్సాఫీసు వద్ద ఆడలేకపోయాయి. దాదాపు ఈ దర్శకుడు పదహారేళ్లుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కూడా హరిహర వీరమల్లు చిత్రాన్ని డైరెక్టర్ క్రిష్ చేయాల్సింది.. కానీ లేట్ అవుతుండటంతో తప్పుకున్నాడు.

First Published:  11 Nov 2024 6:42 PM IST
Next Story