Telugu Global
Telangana

వెయ్యి బడుల్లో దశాబ్ది ఉత్సవాలు..

కంప్యూటర్ ల్యాబ్ లు, సైన్స్ ల్యాబ్ లు, ఉపాధ్యాయులకు ట్యాబ్ లు.. ఇలా అన్నిటికీ నిధులు సమకూరుస్తూ స్కూళ్లను ఆధునీకరిస్తున్నారు. ఈ ఘనతను దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మరోసారి గుర్తు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది.

వెయ్యి బడుల్లో దశాబ్ది ఉత్సవాలు..
X

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి పాఠశాలల్లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ‘మన ఊరు మన బడి - మన బస్తీ మన బడి’ కార్యక్రమంలో భాగంగా.. ఆధునీకరించిన వెయ్యి బడులను దశాబ్ది ఉత్సవాలకోసం సిద్ధం చేస్తున్నారు. జూన్-2 నుంచి 23వరకు 21రోజులపాటు రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా..

తెలంగాణలో మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా.. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా వాటిని ఆధునీకరిస్తున్నారు. మొత్తం స్కూళ్లు 26,072 కాగా తొలి విడతలో 9,145 పాఠశాలలను ఆధునీకరించారు. రూ. 3,497.62 కోట్లు దీనికోసం వెచ్చించారు. ఈ ఏడాది జూన్ లో మరో వెయ్యి బడులను ఆధునీకరించి ప్రారంభించాలనుకుంటున్నారు. ఇతర రాష్ట్రాలు కూడా ఈ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయి.

తాజాగా జరగబోతున్న దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆధునీకరించిన స్కూళ్లను ప్రారంభించాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాల వారీగా వివరాలు సేకరిస్తున్నారు. ఆధునీకరణ పూర్తయిన స్కూళ్లను దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రారంభిస్తారు. ‘మన ఊరు -మన బడి’ కార్యక్రమంలో భాగంగా కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడులు సిద్ధమవుతున్నాయి. పైపై మెరుగులు కాకుండా.. డిజిటల్‌ విద్యకు ప్రాధాన్యం ఇస్తూ అవసరమైన పరికరాలు కేటాయిస్తున్నారు. కంప్యూటర్ ల్యాబ్ లు, సైన్స్ ల్యాబ్ లు, ఉపాధ్యాయులకు ట్యాబ్ లు.. ఇలా అన్నిటికీ నిధులు సమకూరుస్తూ స్కూళ్లను ఆధునీకరిస్తున్నారు. ఈ ఘనతను దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మరోసారి గుర్తు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది.

First Published:  21 May 2023 2:34 AM GMT
Next Story