Telugu Global
Telangana

ప్రతి కుటుంబానికి డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డులు

అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం

ప్రతి కుటుంబానికి డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డులు
X

రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డులు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. మంగళవారం సెక్రటేరియట్‌ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అన్ని కుటుంబాలని హైల్త్‌ ప్రొఫైల్స్‌ రూపొందించిన యూనిక్‌ నెంబర్‌ తో స్మార్ట్‌ కార్డులు ఇవ్వాలని ఆదేశించారు. కుటుంబ వివరాల నమోదులో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోని 238 ప్రాంతాల్లో పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసి డిజిటల్‌ కార్డుల కోసం సర్వే చేస్తామన్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి ఒక పట్టణ, గ్రామీణ ప్రాంతాన్ని పైలెట్‌ ప్రాజెక్టు కోసం ఎంపిక చేయాలన్నారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో గురువారం నుంచి ఈనెల 7వ తేదీ వరకు డోర్‌ టు డోర్‌ సర్వే చేయాలని సూచించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియలో ఆలస్యం సరికాదని, వెంటనే దరఖాస్తులను క్లియర్‌ చేయాలన్నారు. రాష్ట్రంలోని అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీల పరిధి పెంపు, కొత్త అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. గత ప్రభుత్వం నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇండ్లను దసరాలోపు లబ్ధిదారులకు అందజేయాలన్నారు. ఇందుకోసం జిల్లా ఇన్‌చార్జీ మంత్రి చైర్మన్‌గా, కలెక్టర్‌ కన్వీనర్‌ గా కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన జిల్లాలకు ప్రభుత్వం అందజేసిన సాయంతో అవసరమైన పనులు చేపట్టాలన్నారు. ప్రభుత్వం35 రకాల సన్నవడ్లు సాగు చేసిన రైతులకు క్వింటాల్‌ కు రూ.500 చొప్పున బోనస్‌ ఇవ్వాలని నిర్ణయించింది తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 7,144 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ లో సీఎస్‌ శాంతికుమారి, స్పెషల్‌ సీఎస్‌ లు జయేశ్‌ రంజన్‌, అర్వింద్‌ కుమార్‌, ఉన్నతాధికారులు డీఎస్‌ చౌహాన్‌, లోకేశ్‌ కుమార్‌, రఘునందన్‌ రావు, గౌతమ్‌ తదితరులు పాల్గొన్నారు.

First Published:  1 Oct 2024 6:52 PM IST
Next Story