Telugu Global
Telangana

రేషన్‌, హెల్త్‌, వెల్ఫేర్‌ స్కీములకు ఒకే కార్డు

డిజిటల్‌ కార్డుల జారీకి ప్రభుత్వ నిర్ణయం

రేషన్‌, హెల్త్‌, వెల్ఫేర్‌ స్కీములకు ఒకే కార్డు
X

రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి డిజిటల్‌ కార్డులు ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. రేషన్‌ కార్డ్‌, హెల్త్‌ కార్డ్‌ సహా వెల్ఫేర్‌ స్కీములన్నీ అమలు చేయడానికి ఈ డిజిటల్‌ కార్డులు ఇవ్వనున్నారు. ఇందుకోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక అర్బన్‌, రూరల్‌ ప్రాంతాలను ఎంపిక చేసి డిజిటల్‌ కార్డుల జారీకి పైలెట్‌ ప్రాజెక్టు చేపట్టాలని సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలన్నారు. వన్ స్టేట్వ -న్ డిజిటల్ కార్డ్ విధానంతో ముందుకెళ్లాలని సూచించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుతో ఎక్కడైనా సంక్షేమ పథకాలను పొందేలా చర్యలు చేపట్టాలని, ఆ కార్డుతోనే కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్య సేవలందించాలని, అందుకోసం ఆ కార్డులో ప్రతి ఒక్కరి హెల్త్‌ ప్రొఫైల్‌ ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్డుల మానిటరింగ్‌ కు జిల్లాల వారీగా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. రాజస్థాన్‌, హర్యాణ, కర్నాటక రాష్ట్రాల్లో ఇలాంటి విధానం అమలులో ఉందని, అక్కడ స్టడీ చేసి వాటికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు.

First Published:  23 Sept 2024 3:04 PM GMT
Next Story