Telugu Global
Telangana

తెలంగాణలోని హాస్టళ్ల డైట్ ఛార్జీలు భారీగా పెంపు

తెలంగాణలోని వసతిగృహాల్లో డైట్‌, కాస్మోటిక్‌ ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

తెలంగాణలోని హాస్టళ్ల డైట్ ఛార్జీలు భారీగా పెంపు
X

తెలంగాణ సర్కార్ విద్యార్థులకు శుభ వార్త చెప్పింది. రాష్ట్రంలోని అన్ని గురుకులాలు, శాఖలకు చెందిన అనుబంధ హాస్టళ్లలో డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 3 నుంచి 7వ తరగతి వరకు రూ.950గా ఉన్న డైట్‌ ఛార్జీలను రూ.1,330కి పెంచారు. 8 నుంచి 10వ తరగతి వరకు రూ.1100 నుంచి రూ.1,540కి పెంచారు. ఇంటర్‌ నుంచి పీజీ వరకు రూ.1,500 నుంచి రూ.2,100కి పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా 7,65,700 మంది హాస్టల్‌ విద్యార్థులు ఉన్నారు. 3 నుంచి 7వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రూ.55గా ఉన్న కాస్మోటిక్‌ ఛార్జీలను రూ.175కి పెంచారు. 8 నుంచి 10వ తరగతి వరకు రూ.75 నుంచి రూ.275కి పెంచారు.

First Published:  30 Oct 2024 8:30 PM IST
Next Story