Telugu Global
Andhra Pradesh

గత ఐదేళ్లు తిరుమలకే వెళ్లలేదు : టీటీడీ ఛైర్మన్

టీటీడీలో గత ప్రభుత్వం చాలా అరాచకాలు చేసిందని టీటీడీ నూతన చైర్మన్ బీఆర్ నాయుడు ఆరోపించారు.

గత ఐదేళ్లు తిరుమలకే వెళ్లలేదు : టీటీడీ ఛైర్మన్
X

గత వైసీపీ ప్రభుత్వం టీటీడీలో అరాచకాలు సృష్టించిందని తిరుమల నూతన ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆరోపించారు. ఏడాదికి ఐదారుసార్లు తిరుమలకు వెళ్లే వాళ్లమని, గడిచిన ఐదేళ్లలో ఒక్కసారి కూడా శ్రీవారి ఆలయానికి వెళ్లలేదన్నారు. గత ప్రభుత్వం టీటీడీలో అనేక అరాచకాలు చేసిందని ఆరోపించారు. తనకు తనకు ఇంత గౌరవమైన పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీయే పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. అర్చకుల నుంచి వేదాశీర్వచనం తీసుకున్న అనంతరం.. మీడియాతో మాట్లాడారు. ‘చిత్తూరు జిల్లాలోనే పుట్టిపెరిగాను.

బాల్యం నుంచి తిరుమలకు తప్ప వేరే ఆలయాలకు వెళ్లేవాడిని కాదు. మా ప్రాంతంలో కొండకు పోతాం అంటాం.. కొండ అంటే తిరుమల. ఈరోజుకీ అక్కడ అదే ఆనవాయితీ ఉంది. టీటీడీ ఛైర్మన్‌ పదవి రావడం నా జీవితంలో కొత్త మలుపుగా భావిస్తున్నాను. దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాని ఆయన తెలిపారు. శ్రీవారి ఆలయ పవిత్రతను వైసీపీ దెబ్బతీయడంతోనే నేను కోండకు వెళ్లలేదన్నారు. శ్రీవారి ట్రస్టును రద్దు చేయాలనే ఆలోచన ఉందన్నారు. ముఖ్యమంత్రి సలహాలు, సూచనలతో ముందుకెళ్లా అని ఆయన పేర్కొన్నారు.

First Published:  31 Oct 2024 5:58 AM GMT
Next Story