Telugu Global
Telangana

చంద్రబాబు కోసం రేవంత్ రెడ్డి రాయబారం నడిపించారా? సిద్దార్థ్ లూథ్రాకు కాంగ్రెస్‌తో ఉన్న సంబంధం ఏంటి?

రేవంత్ రెడ్డి ఇటీవల బెంగళూరు వెళ్లి కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కలిశారు. అక్కడ చంద్రబాబు అరెస్టు విషయంపై చర్చ జరిగిందని.. దాని నుంచి తప్పించడానికి సాయం చేయాలని డీకేను కోరినట్లు సమాచారం.

చంద్రబాబు కోసం రేవంత్ రెడ్డి రాయబారం నడిపించారా? సిద్దార్థ్ లూథ్రాకు కాంగ్రెస్‌తో ఉన్న సంబంధం ఏంటి?
X

టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు కాకుండా రేవంత్ రెడ్డి రాయబారం నడిపించారా? చంద్రబాబు కోసం లాయర్ సిద్దార్థ లూథ్రా రావడం వెనుక రేవంత్ రెడ్డి హస్తం ఉన్నదా? నెల రోజుల క్రితమే చంద్రబాబుకు అరెస్టు విషయం తెలుసా? అంటే అవుననే సమాధానం వస్తోంది. చంద్రబాబు నాయుడికి తన అరెస్టు విషయం ముందుగానే తెలుసని.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తనను తప్పకుండా అరెస్టు చేస్తారని ఆయన ఊహించారని.. అందుకే ముందస్తుగా ఢిల్లీ లెవెల్‌లో తన కోసం రాయబారం నడపడానికి రేవంత్ రెడ్డిని వాడుకున్నారని తెలుస్తున్నది. ఈ మేరకు ఒక ఆంగ్ల దినపత్రిక కథనం వెలువరించింది.

రేవంత్ రెడ్డి ఇటీవల బెంగళూరు వెళ్లి కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కలిశారు. అక్కడ చంద్రబాబు అరెస్టు విషయంపై చర్చ జరిగిందని.. దాని నుంచి తప్పించడానికి సాయం చేయాలని డీకేను కోరినట్లు సమాచారం. చంద్రబాబుతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. ఆయన నాకు గురువు కాదని రేవంత్ రెడ్డి పదే పదే మీడియాకు చెబుతుంటారు. కానీ తాజాగా చంద్రబాబు కోసం రాయబారం నడిపిన విషయం బయటపడటంతో వారిద్దరి మధ్య సంబంధం ఏంటో మరో సారి వెల్లడైంది.

కాగా, చంద్రబావు అరెస్టును ఆపడం తన చేతిలో ఏమీ ఉండదని.. ఏపీలోని అధికార వైసీపీ, కేంద్రంలోని బీజేపీ సఖ్యతతో ఉన్నాయి. ఇలాంటి సమయంలో బాబును అరెస్టు నుంచి తప్పించడం తన వల్ల కాదని డీకే చెప్పినట్లు సమాచారం. అయితే బాబు తరపున వాదించడానికి సిద్దార్థ లూథ్రాను డీకేనే అరేంజ్ చేసినట్లు తెలుస్తున్నది. డీకే శివకుమార్‌కు లీగల్ కన్సల్టెంట్‌గా వ్యవహరించే సిద్దార్థ లూథ్రాను ఆయనే బాబు కోసం పంపించినట్లు తెలుస్తున్నది. అంటే చంద్రబాబు తరపున వాదించడానికి ఒక కాంగ్రెస్ డిప్యూటీ సీఎం తన లాయర్‌పు పంపినట్లే అని అర్థం చేసుకోవచ్చు. దీనికి కూడా రేవంత్ రెడ్డి రాయబారమే కారణమని తెలుస్తున్నది.

ఒకప్పుడు కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు అరెస్టును ఏ పార్టీ నాయకుడు కూడా ఖండించక పోవడం గమనార్హం. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, బీజేపీ నాయకుడు లక్ష్మణ్ తప్ప ఎవరూ చంద్రబాబు అరెస్టుపై స్పందించలేదు. చంద్రబాబుకు రాహుల్ గాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ పవార్ వంటి నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కానీ వారెవరూ బాబు అరెస్టుపై నోరు విప్పలేదు. ఇక పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఒక్కరే బాబు కోసం మాట్లాడారు. అది కూడా తన పార్టీ ఎంపీ అభిషేక్‌పై ఈడీ దాడుల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. బాబు అరెస్టు తీరు సక్రమంగా లేదనే వ్యాఖ్యానించారు తప్ప.. అంతకు మించి మరో మాట మాట్లాడలేదు. అన్ని పార్టీలు బాబు అరెస్టును లైట్ తీసుకున్నా.. రేవంత్ రెడ్డి మాత్రం ఎప్పటికప్పుడు తెరవెనుక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

First Published:  13 Sept 2023 12:15 AM GMT
Next Story