Telugu Global
Telangana

భారత్‌ జోడో యాత్ర బస్సు.. తెలంగాణ ప్రజల సొమ్మేనా..?

TS 09 GF 8055 నంబర్‌తో ఈ బస్సును రిజిస్ట్రర్ చేయించారు. దీంతో అధికారంలోకి వచ్చిన నెల రోజులు కూడా గడవకముందే తెలంగాణ ప్రజల సొమ్మును కాంగ్రెస్‌ పార్టీ ఇష్టారీతిన వాడుకుంటుందంటూ బీఆర్ఎస్, BJP కార్యకర్తలు ట్రోల్ చేస్తున్నారు.

భారత్‌ జోడో యాత్ర బస్సు.. తెలంగాణ ప్రజల సొమ్మేనా..?
X

భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో రాహుల్‌గాంధీ కోసం ఉపయోగిస్తున్న బస్సుపై ఇప్పుడు తెలంగాణలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇందుకు కారణం అది తెలంగాణలో రిజిస్టర్ కావడమే. ఈ బస్సుకు సంబంధించిన పిక్‌ ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య డైలాగ్‌ వార్ నడుస్తోంది.

TS 09 GF 8055 నంబర్‌తో ఈ బస్సును రిజిస్ట్రర్ చేయించారు. దీంతో అధికారంలోకి వచ్చిన నెల రోజులు కూడా గడవకముందే తెలంగాణ ప్రజల సొమ్మును కాంగ్రెస్‌ పార్టీ ఇష్టారీతిన వాడుకుంటుందంటూ బీఆర్ఎస్, BJP కార్యకర్తలు ట్రోల్ చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు ప్రజల సొమ్మును ఉపయోగిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.

మరోవైపు కాంగ్రెస్ నేతలు మాత్రం ఇది తెలంగాణ ప్రజల సొమ్ము కాదని.. ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్‌ రెడ్డి ఈ బస్సును గిఫ్ట్‌గా ఇచ్చారని చెప్తున్నారు. ఇక బస్సు నంబర్‌కు సైతం కొత్త బాష్యం చెప్తున్నారు. టీఎస్ అంటే తెలంగాణ స్టేట్ అని 09 అంటే రేవంత్ లక్కీ నంబర్ అని... GF అంటే గాంధీ ఫ్యామిలీ అని.. 8055 అంటే BOSS అంటూ వివరిస్తున్నారు. భారీ కాన్వాయ్‌తో కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్లిన విషయం మరిచిపోవద్దంటూ కాంగ్రెస్‌ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.

మణిపూర్‌లో ఆదివారం ప్రారంభమైన భారత్‌ జోడో న్యాయ్ యాత్ర దాదాపు 15 రాష్ట్రాలు, 100 లోక్‌సభ స్థానాల మీదుగా సాగనుంది. మొత్తం 67 రోజుల పాటు 110 జిల్లాలు కవర్ చేస్తూ 6 వేల 700 కిలోమీటర్లు ప‌ర్య‌టించ‌నున్నారు రాహుల్ గాంధీ.

First Published:  15 Jan 2024 8:53 AM GMT
Next Story