Telugu Global
Telangana

రేవంత్‌ రెడ్డి వర్సెస్‌ అక్బరుద్దీన్‌.. అసెంబ్లీలో మాటల తూటాలు

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన అక్బరుద్దీన్‌.. ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చింది వై.ఎస్‌.రాజశేఖర రెడ్డి అని.. రిజర్వేషన్లు ఇచ్చిన నాడు రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో తనకు తెలియదంటూ సెటైర్లు వేశారు

రేవంత్‌ రెడ్డి వర్సెస్‌ అక్బరుద్దీన్‌.. అసెంబ్లీలో మాటల తూటాలు
X

తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్‌ రంగంపై రిలీజ్ చేసిన శ్వేతపత్రంపై చర్చ హాట్‌హాట్‌గా సాగింది. ఇదే అంశంపై మాట్లాడుతూ MIM ఫ్లోర్ లీడర్‌ అక్బరుద్దీన్ ఓవైసీ ఓల్డ్‌ సిటీలోని పలు సమస్యలను ప్రస్తావించారు. అయితే మధ్యలో కలగజేసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ.. అక్బరుద్దీన్ గత పదేళ్లు ఏం చేశారంటూ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. కవ్వంపల్లి వ్యాఖ్యలపై మండిపడ్డారు అక్బరుద్దీన్‌. వంద కోట్లతో పనులు చేసినప్పుడు పది కోట్ల పనులు మిగిలిపోతుంటాయని, వాటి గురించే తాను ప్రస్తుత ప్రభుత్వాన్ని అడుగుతున్నానంటూ కాంగ్రెస్‌పై ఫైర్ అయ్యారు. విద్యుత్ అప్పులపై కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని.. ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఈ శ్వేతపత్రం తీసుకొచ్చిందంటూ ప్రశ్నించారు. అప్పులు చేయకుండా.. చార్జీలు పెంచకుండా కరెంట్ ఫ్రీగా ఎలా ఇస్తుందని ప్రశ్నించారు అక్బరుద్దీన్.

అక్బరుద్దీన్‌ లేవనెత్తిన అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. విద్యుత్ బకాయిల విషయంలో సిద్దిపేట నియోజకవర్గం ఫస్ట్ ప్లేసులో ఉందని.. రెండో స్థానంలో గజ్వేల్ ఉందని.. మూడో స్థానంలో హైదరాబాద్‌ సౌత్‌ ఓల్డ్‌ సిటీ ఉందన్నారు. వందల కోట్ల విద్యుత్ బకాయిలు ఉన్నా MIM ఇన్నాళ్లూ ఎందుకు ప్రశ్నించలేదన్నారు రేవంత్. ముస్లింలు అంటే కేవలం MIM కాదని.. ముస్లింలకు కాంగ్రెస్ పార్టీనే అండగా ఉందన్నారు. ముస్లింలను రాష్ట్రపతులను, సీఎంలను చేసిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు రేవంత్ రెడ్డి.


రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన అక్బరుద్దీన్‌.. ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చింది వై.ఎస్‌.రాజశేఖర రెడ్డి అని.. కాంగ్రెస్‌ పార్టీ క్రెడిట్ కాదన్నారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు దక్కడంలో కాంగ్రెస్‌ పాత్ర ఎంత ఉందో MIM పాత్ర కూడా అంతే ఉందన్నారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు మేనిఫెస్టోలో పెడతామంటేనే ఆనాడూ వైఎస్‌తో కలిసి నడిచామన్నారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన నాడు రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో తనకు తెలియదంటూ సెటైర్లు వేశారు అక్బరుద్దీన్‌.

First Published:  21 Dec 2023 5:42 PM IST
Next Story