రాష్ట్రానికి రెండో రాజధానిగా వరంగల్ అభివృద్ధి
కేంద్రం అనుమతిస్తే మామునూరు విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందన్న మంత్రి పొంగులేటి
BY Raju Asari3 Nov 2024 2:23 PM IST

X
Raju Asari Updated On: 3 Nov 2024 2:23 PM IST
భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వరంగల్‌లో భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఆలయ మాడ వీధులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. ఇక్కడి జలాశయాన్ని తాగునీటి జలాశయంగా మారుస్తామన్నారు. భద్రకాళి చెరువు కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. సర్వే చేయించి నిర్మాణాలను తొలిగిస్తామన్నారు. వరంగల్‌ను రాష్ట్రానికి రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని అన్నారు. కేంద్రం అనుమతిస్తే మామునూరు విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందని మంత్రి పొంగులేటి తెలిపారు.
Next Story