స్మితా సబర్వాల్ ఇంట్లోకి చొరబడ్డ డిప్యూటీ తహసీల్దార్ సస్పెండ్
జూబ్లీ హిల్స్ , ప్లజెంట్ వ్యాలీ, బీ11 లో నివసిస్తున్న స్మితా సబర్వాల్ ఇంటికి తన స్నేహితుడితో కలిసి వెళ్ళాడు ఆనంద్ కుమార్ రెడ్డి. స్నేహితుడిని కార్లో బైటే ఉంచి తాను మాత్రం మొదటి అంతస్తులోకి వెళ్ళి స్మితా సబర్వాల్ తలుపు తట్టాడు.
తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి, సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఇంట్లోకి చొరబడ్డ డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఆనంద్ కుమార్ రెడ్డి ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నారు. జైలుకు వెళ్ళి రెవెన్యూ శాఖ అధికారులు సస్పెన్షన్ ఉత్తర్వులను ఆయనకు అందించనున్నారు.
కాగా, జూబ్లీ హిల్స్ , ప్లజెంట్ వ్యాలీ, బీ11 లో నివసిస్తున్న స్మితా సబర్వాల్ ఇంటికి తన స్నేహితుడితో కలిసి వెళ్ళాడు ఆనంద్ కుమార్ రెడ్డి. స్నేహితుడిని కార్లో బైటే ఉంచి తాను మాత్రం మొదటి అంతస్తులోకి వెళ్ళి స్మితా సబర్వాల్ తలుపు తట్టాడు.
ఆమె కిటీకీలోంచి ఇతన్ని చూసి భయంతో కేకలు వేశారు. అంతే కాకు౦డా పోలీసులకు కూడా ఫోన్ చేశారు. ఈ హడావిడిలో భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకొని ఆనంద్ కుమార్ రెడ్డిని, అతని స్నేహితుణ్ణి పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
నిందితులిద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని కోర్టు ముందు హాజరుపరచగా కోర్టు వారికి 14 రోజులు రిమాండ్ విధించింది.