మంత్రి వర్గ విస్తరణపై డిప్యూటీ సీఎం భట్టి సంచలన వాఖ్యలు
రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ పై తుది నిర్ణయం హైకమాండ్‌దేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
తెలంగాణ మంత్రి వర్గ విస్తరణపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. కేబినేట్ విస్తరణను కాంగ్రెస్ హైకమాండ్ చూసుకుంటుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనపై 50 శాతానికి పైగా ప్రజలు ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎంతో కొంత సర్కార్‌పై వ్యతిరేకత ఉండటం సహజమని అన్నారు. హైడ్రాకు ఎలాంటి నిబంధన లేదని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు హైడ్రా తీసుకొచ్చామని భట్టి తెలిపారు. రైతులకు ఇచ్చే బోనస్‌తో అన్నదాతకు ఎక్కువ లబ్ధి కలుగుతోందని ఆయన అన్నారు. ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లనిర్మాణానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. ఇక రైతు భరోసా పథకాన్ని సంక్రాంతి నుంచి అమలు చేయబోతున్నామని ప్రకటించారు. గత సర్కార్ చేసిన అప్పులకు ఇప్పటి వరకు రూ.64 వేల కోట్లు అసలు, వడ్డీలు కట్టామని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన కంటే తాము ప్రజలకు మెరుగైన పాలన అందజేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రధాన ప్రతిపక్షానికి కౌంటర్ ఇచ్చారు.