క్రిస్మస్ వేడుకలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష
క్రిస్మస్ వేడుకలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు.
BY Vamshi Kotas27 Nov 2024 7:10 PM IST

X
Vamshi Kotas Updated On: 27 Nov 2024 7:17 PM IST
క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజాభవన్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఎల్బీ స్టేడియంలో జరిగే వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరవుతున్న నేపథ్యంలో కట్టదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. క్రిస్మస్‌ను పేదలు సంతోషంగా జరుపుకోవాలనే ఆలోచనతో పేదలకు ప్రభుత్వం గిఫ్ట్ ప్యాక్‌లు పంపిణీ చేస్తున్నదని, కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.
Next Story